
సాక్షి, చిత్తూరు: కరోనా వైరస్ సామాన్యులనే కాకుండా ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కోవిడ్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా సత్యవేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. చదవండి: (95 వేలు దాటిన కోవిడ్ మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment