satyavedu mla
-
కోనేటి ఆదిమూలంకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, చిత్తూరు : కరోనా పాజిటివ్ బారినపడి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉదయం ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడకుండా వైద్యుల సలహాలను పాటించాలని ఆయనకు సూచించినట్లు ఎమ్మెల్యే తనయుడు, సింగిల్ విండో డైరెక్టర్ కోనేటి సుమన్‌కుమార్ పేర్కొన్నారు. (ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ పరామర్శ) కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే తొలుత తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం సాయంత్రం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఎమ్మెల్యేను డెప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ పరామర్శించారు. -
ఎమ్మెల్యే ఆదిమూలంకి కరోనా
సాక్షి, చిత్తూరు: కరోనా వైరస్ సామాన్యులనే కాకుండా ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కోవిడ్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా సత్యవేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. చదవండి: (95 వేలు దాటిన కోవిడ్ మరణాలు) -
ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం
సాక్షి,చిత్తూరు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదిమూలం తల్లి కాంతమ్మ(86) తన స్వగ్రామం నారాయణవనం మండలంలోని భీముని చెరువులో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆదిమూలం కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రగాడ సంతాపం తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ అభిమాన అధికారులూ వెళ్లిపోండి
సత్యవేడు: వైఎస్ఆర్ సీపీపై అభిమానం ఉన్న అధికారులు, సిబ్బంది మరో ప్రాంతానికి బదిలీ చేయించుకోవాలని సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య హెచ్చరించారు. టీడీపీ నాయకులు చెప్పే పనులతో పాటు సర్పంచ్‌లకు పనులు చేయని అధికారులు తన నియోజకవర్గంలో అవసరం లేదన్నారు. స్థానిక ఓ కల్యాణ మండపంలో బుధవారం నియోజకవర్గ స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఎమ్మెల్యే ఆదిత్య మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతి నిధుల తీర్మానం ఉన్నా, లేకున్నా, గృహ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు మెజారిటీ జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతో చేయాలని మండల అధికారులను ఆదేశించారు. సర్పంచ్‌ను కారణంగా చూపించి పనులు ఆపేయించే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవన్నారు. తమిళనాడుకు ఇసుక అక్రమంగా రవాణా చేయవద్దని ఆయన టీడీపీ నాయకులను కోరారు.