కోనేటి ఆదిమూలం
సాక్షి, చిత్తూరు : కరోనా పాజిటివ్ బారినపడి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడకుండా వైద్యుల సలహాలను పాటించాలని ఆయనకు సూచించినట్లు ఎమ్మెల్యే తనయుడు, సింగిల్ విండో డైరెక్టర్ కోనేటి సుమన్‌కుమార్ పేర్కొన్నారు. (ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ పరామర్శ)
కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే తొలుత తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం సాయంత్రం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఎమ్మెల్యేను డెప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్ పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment