steam
-
ముఖానికి ఆవిరి ఎంత సేపు?
బ్యూటీపార్లర్లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో తెలుసుకోవడం అవసరం. ♦ మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్‌బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడతాయో, సుమారు అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. ♦ ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు కాబట్టి అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్ట రాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకుని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారుతాయి. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది. ♦ ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ♦ తర్వాత పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఒకవేళ చర్మం పొడిబారినట్టుగా అనిపిస్తే గనక ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. ♦ చర్మతత్వానికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం చేయడం మేలు. -
కరోనా రాకుండా.. స్టీమ్ బూత్
సాక్షి, పలమనేరు: విధుల్లో ఉండేవారు కరోనా వైరస్ బారిన పడకుండా ‘కరోనా స్టీమ్ బూత్’ పేరిట ఓ యంత్రాన్ని రూపొందించాడు.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్. చదివింది పదో తరగతే అయినా.. ఇప్పటికే పలు ప్రయోగాలు చేసి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా అతడు తయారు చేసిన స్టీమ్ బూత్‌లోకి వెళితే నాలుగు నిమిషాల్లోనే శరీరమంతా శానిటైజేషన్ చేసుకోవచ్చు. దీంతో శరీరం, గొంతుతో సహా తల వెంట్రుకల్లో ఉండే వైరస్ మొత్తం నశిస్తుందని చెబుతున్నాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లా ఉండే దీని తయారీకి కేవలం రూ.8 వేలు మాత్రమే ఖర్చు కావడం మరో విశేషం. వీటిని క్వారంటైన్ సెంటర్ల వద్ద లేదా ఎక్కువ జన సమూహాలుండే చోట అమర్చితే ఎంతో మేలుగా ఉంటుందని అంటున్నాడు పవన్. చిత్తూరును రెడ్ జిల్లాగా ప్రకటించిన కేంద్రం -
ఫ్యాన్స్ షాక్: క్రిస్ లిన్ నెత్తిపై పొగలు
హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వసంకర క్రికెటర్ క్రిస్ లిన్‌కు కోపం వచ్చింది.. మైదానంలోనే సహచర ఆటగాళ్లపై మండిపడ్డాడు.. ఆ వెంటనే అతడి నెత్తిపై నుంచి పొగలు వచ్చాయి. ఈ విచిత్ర ఘటన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కనిపించింది. శుక్రవారం రావల్పిండి వేదికగా పెషావర్ జల్మి-లాహోర్ ఖలందర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ లిన్ నెత్తిపై పొగలు రావడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే కొందరు ఫ్యాన్స్ అవాక్కవుతుండగా.. మరికొందరు కెమెరా జిమ్మిక్కు కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే కెమెరా పనితనం ఏమి లేదని, పొగలు వచ్చిన మాట వాస్తవమని, దానికి కారణాలు తెలియవని ఈ విచిత్ర ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ అభిమాని పేర్కొన్నాడు. (చదవండి: ‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’) ఇక ఈ మ్యాచ్‌లో క్రిస్ లిన్ ప్రాతినిథ్యం వహించిన లాహోర్ ఖలందర్స్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ జట్టు 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనపై క్రిస్ లిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనే అతడి నెత్తిపై పొగలు వచ్చాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులే సాధించి ఓటమి పాలైంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రిస్ లిన్ మెరుపుల గురించి తెలియన వారు ఉండరు. గత సీజన్ వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు.. రానున్న సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు. Never seen anything like this. Serious heat 😮 pic.twitter.com/qRj2T5knc7 — Mazher Arshad (@MazherArshad) February 28, 2020 చదవండి: కోహ్లి.. అందుకే విఫలం కెప్టెన్ అయినంత మాత్రాన అలా చేస్తావా? -
ఆవిరి స్నానంతో గుండెపోటుకు చెక్!
లండన్ : తరచూ ఆవిరి స్నానం చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని కేంబ్రిడ్జ్ , యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ తదితర వర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దాదాపు 15 ఏళ్ల పాటు నిర్వహించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికోసం 53 నుంచి 74 ఏళ్ల లోపు వయసున్న 1,628 స్త్రీ, పురుషులు వారానికి చేసే ఆవిరి స్నానాల సంఖ్య ఆధారంగా విభజించి పరిశీలించింది. ఇందులో వారానికి ఒకసారి ఆవిరి స్నానం చేసేవాళ్లతో పోలిస్తే రెండు, మూడు సార్లు చేసేవాళ్లలో 14శాతం, నాలుగు నుంచి ఏడుసార్లు చేసేవాళ్లలో 61శాతం గుండెపోటు ముప్పు తక్కువైనట్లు తేల్చింది. దీనికి కారణం ఆవిరి స్నానంతో బీపీ తగ్గడం, రోగ నిరోధకత, నాడీ వ్యవస్థ, హృదయ స్పందనల తీరు మెరుగుపడడం అని గుర్తించింది. కాగా, అంతకుముందు ఇదే పరిశోధకుల బృందం చేసిన మరో అధ్యయనంలోనూ బీపీ, హృదయ స్పందనలపై ఆవిరి స్నానం ప్రభావం చూపుతుందని వెల్లడి కావడం గమనార్హం. -
ఆరోగ్యం
మెరిసే చర్మం కావాలని ఎవరికి ఉండదు. మరి దానికి ఇంట్లోనే స్టీమ్ పెట్టుకుంటే సరి. అదెలా అంటారా? అయితే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో ఒక టీ బ్యాగ్‌ను వేయండి. తర్వాత ముఖాన్ని ఆ గిన్నెకు దగ్గరగా పెట్టి మీద ఒక టవల్ కప్పేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత ముఖాన్ని టిష్యూ పేపర్‌తో తుడిచేసుకోండి.కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. కళ్ల కింద నల్లటి వలయాలతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. దానికి ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన చల్లటి బంగాళదుంప ముక్కలను కళ్లపై పెట్టుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అందులోని బ్లీచింగ్ ఏజెంట్ ఆ మచ్చలను మటుమాయం చేస్తుంది.బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవడం మరచిపోకండి. అందుకు బ్రౌన్ షుగర్, శనగపిండి, ఆలివ్ ఆయిల్‌తో కలిపిన మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే దూరమైన నిగారింపు మీ సొంతం. -
బ్యూటీ
హెయిర్ డై జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీపడకూడదు. జుట్టు సువాసనలు వెదజల్లాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రే వాడచ్చు. జుట్టు సిల్కీగా మారాలనుకుంటే స్ట్రెయిటనింగ్ షాంపూ, కండిషనర్ వాడితే కొంతవరకు ఫలితం ఉంటుంది. ముల్తానీ మిట్టి ముల్తానీ మిట్టి ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం టైట్ అవుతుందని, కాంతిమంతం కూడా అవుతుందని అంటారు. అయితే కాలుష్యం, సరైన జీవనశైలి లేని ఈ కాలంలో ముల్తానీ మిట్టిని వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ముల్తానీ మిట్టి చర్మాన్ని మరింతగా పొడిబారేలా చేస్తుంది. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అంతగా కావాలనుకుంటే 1ఎమ్.ఎల్, 2 ఎమ్.ఎల్ మాత్రమే అదీ ముల్తానీ మిట్టి లిక్విడ్‌ను ఫేస్‌ప్యాక్‌లలో ఉపయోగించవచ్చు. స్టీమ్ ఫేసియల్ చేసే సమయంలో ముఖానికి ఆవిరి పట్టడం చూస్తుంటాం. అధికంగా ఆవిరిపట్టడం వల్ల చర్మంలోని పోర్స్ ఓపెన్ అయ్యి, చర్మం వదులయ్యే అవకాశాలు ఉన్నాయి. అమితంగా స్క్రబ్ చేయడం, స్టీమ్ పట్టడం వంటివి చర్మంలోని సహజతేమను పోగొడతాయి. అప్పటికి కాంతిగానే అనిపించినా, తర్వాత చర్మం జీవం కోల్పోయినట్టు తయారవుతుంది. అందుకని వీలైనంత వరకు స్టీమ్‌ను తగ్గించడం మేలు. మొటిమలు మొటిమలు రావడానికి తలలో చుండ్రు ప్రధాన కారణం. తలలో చుండ్రు ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి ఆ నీటితో తలను శుభ్రపరుచుకోవాలి. ముఖం మీద జిడ్డు లేకుండా జాగ్రత్తపడాలి. అప్పటికీ మొటిమల సమస్య వదలకపోతే చిరోంజి పప్పును పొడి చేసి, పచ్చిపాలలో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తుంటే మొటిమలు, నల్లమచ్చలు తగ్గి, ముఖం ఫెయిర్‌గా అవుతుంది. ట్యాన్ స్నానం చేయడానికి అరగంట ముందు కమలాపండు తొక్కను గుజ్జులా చేసి, కొద్దిగా పాలు కలిపి మేనికి పట్టించి, స్క్రబ్ చేయాలి. ఇవి ట్యాన్‌ని పోగొట్టడమే కాకుండా, చర్మాన్ని కాంతిమంతంగా చేస్తాయి.