ఆరోగ్యం
మెరిసే చర్మం కావాలని ఎవరికి ఉండదు. మరి దానికి ఇంట్లోనే స్టీమ్ పెట్టుకుంటే సరి. అదెలా అంటారా? అయితే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో ఒక టీ బ్యాగ్‌ను వేయండి. తర్వాత ముఖాన్ని ఆ గిన్నెకు దగ్గరగా పెట్టి మీద ఒక టవల్ కప్పేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత ముఖాన్ని టిష్యూ పేపర్‌తో తుడిచేసుకోండి.కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి.
కళ్ల కింద నల్లటి వలయాలతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. దానికి ఫ్రిజ్‌లోంచి అప్పుడే తీసిన చల్లటి బంగాళదుంప ముక్కలను కళ్లపై పెట్టుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అందులోని బ్లీచింగ్ ఏజెంట్ ఆ మచ్చలను మటుమాయం చేస్తుంది.బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవడం మరచిపోకండి. అందుకు బ్రౌన్ షుగర్, శనగపిండి, ఆలివ్ ఆయిల్‌తో కలిపిన మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే దూరమైన నిగారింపు మీ సొంతం.