చర్మానికి పేస్ట్
గంధం పొడి, శనగపిండి, బాదంపప్పు పేస్ట్‌లను టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. అందులో ఐదు రేకల కుంకుమపువ్వు, గుడ్డులోని తెల్లసొన, కొన్ని పచ్చిపాలను చేర్చి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేస్తుంటే చర్మానికి మెరుపు వస్తుంది.
ఓ నిమిషం
అరటిపండు గుజ్జులో ఒక స్పూను పెసరపిండి, మంచి గంధం, తేనె వేసి కలపాలి. దీనితో ముఖానికి ప్యాక్ వేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. టమాటా గుజ్జులో కొద్దిగా తేనె కలిపి చేతులకు పట్టించాలి. అరగంట తర్వాత కాసిన్ని పచ్చిపాలతో మసాజ్ చేసి అప్పుడు కడిగేసుకుంటే... మృతకణాలు తొలగిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment