హెల్త్‌: 'మెగా షేప్‌ మసాజర్‌' తో.. ఫిట్‌నెస్‌ సెంటర్స్‌కి చెక్‌! | Health: Body Fitness With Mega Shape Massager | Sakshi
Sakshi News home page

హెల్త్‌: 'మెగా షేప్‌ మసాజర్‌' తో.. ఫిట్‌నెస్‌ సెంటర్స్‌కి చెక్‌!

Published Sun, Mar 10 2024 2:23 PM | Last Updated on Sun, Mar 10 2024 2:23 PM

Health: Body Fitness With Mega Shape Massager - Sakshi

ఏ డ్రెస్‌ వేసుకున్నా.. అతికినట్టు సరిపోవాలంటే బాడీ సరైన షేప్‌లో ఉండాలి. అందుకే స్లిమ్‌ అండ్‌ ఫిట్‌ షేప్‌ కోసం నానాతంటాలు పడేది! ఆ కష్టాన్నించి గట్టెక్కించేదే ఈ మసాజర్‌. ఇది చక్కటి శరీరాకృతిని అందిస్తుంది. దీన్ని సాధారణ సమయాల్లోనే కాదు.. స్నానం చేస్తున్నప్పుడూ వాడుకోవచ్చు. సాధారణంగా మెషిన్స్‌కి వాటర్‌ తగిలితే పనిచేయవు. కానీ ఇది అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందిన మెషిన్‌ కాబట్టి..  వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. దాంతో స్నానం చేస్తూ కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

మొదట ఏదైనా ఆయిల్‌ లేదా స్కిన్‌  టైటెనింగ్‌ క్రీమ్‌ని అప్లై చేసుకుని.. ఈ మసాజర్‌తో ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు. మొత్తం 8 రోలర్లు, 13 ప్రోట్రూషన్‌ లతో కూడిన ఈ బ్యూటీ మసాజర్‌.. ఒత్తిడిని దూరం చేస్తుంది. డివైస్‌కి అమర్చుకునే రోలర్స్‌.. నాలుగు నాలుగు చొప్పున రెండు పార్ట్స్‌గా అమర్చి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు. మసాజ్‌ సమయంలో స్పీడ్‌ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.

ఇది కొవ్వును తగ్గిస్తూ  యవ్వనంగా మారుస్తుంది. ఈ డివైస్‌తో పాటు.. ఎసిటినో 5డి డిజైనింగ్‌ క్రీమ్‌ కూడా లభిస్తుంది. దీన్ని విడిగా కూడా మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫిట్‌నెస్‌ సెంటర్స్‌కి వెళ్లాల్సిన పని లేకుండానే.. ఈ డివైస్‌ మిమ్మల్ని నాజూగ్గా, స్లిమ్‌గా మారుస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్‌ పెడితే..  సుమారు 30 గంటల పాటు పని చేస్తుంది. కాళ్లు, చేతులు, నడుము, మెడ, పొట్ట భాగాల్లో పేరుకున్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీన్ని మెత్తటి క్లాత్‌ లేదా టిష్యూ సాయంతో క్లీన్‌  చేసుకోవచ్చు. వినియోగించడం.. ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం అంతా సులభమే. దీని ధర 207 డాలర్లు. అంటే 17,167 రూపాయలు.

ఇవి చదవండి: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పింక్‌ సీక్విన్‌ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement