
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై చట్టపరమైన నిషేధ నిబంధనలను పటిష్టస్థాయిలో అమలుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులోభాగంగా, పోలింగ్ బూత్‌లలో పొగాకు సంబంధ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయనున్నారు. బీడీ, సిగరెట్, గుట్కాలతోపాటు నమిలే పొగాకు ఉత్పత్తులనూ పోలింగ్ బూత్‌లలో నిషేధించింది. పొగ తాగడంసహా, ఉత్పత్తులపై నిషేధం పూర్తిగా అమలయ్యేలా జిల్లా ఎలక్టోరల్/జిల్లా మెజిస్ట్రేట్‌లను ఆదేశించాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈసీ లేఖలు రాసింది. ‘దేశంలోని అన్ని పోలింగ్ బూత్‌లు పొగాకురహితంగా ఉండాలి’ అని ఈసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment