EC official announcement
-
ఇక 17ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు
-
ఇకపై 17 ఏళ్లకే ఓటర్ కార్డు దరఖాస్తు.. ఈసీ కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ, 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనుప్ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. ఏడాదిలో మూడుసార్లు అవకాశం.. యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1వ తేదీల్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ప్రతి త్రైమాసికానికి ఓటర్ జాబితాను అప్డేట్ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్పీ యాక్ట్ 1950లోని సెక్షన్ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్, 1960 చట్టాల్లో మార్పులు చేసింది న్యాయశాఖ. దరఖాస్తు ఫారాలను సైతం యూజర్ ఫ్రెండ్లీగా మార్చనుంది ఈసీ. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. ఇదీ చదవండి: గూగుల్‌తో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ ఉండదటా! -
పోలింగ్ ప్రాంతంలో పొగాకు ఉండదిక!
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై చట్టపరమైన నిషేధ నిబంధనలను పటిష్టస్థాయిలో అమలుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులోభాగంగా, పోలింగ్ బూత్‌లలో పొగాకు సంబంధ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయనున్నారు. బీడీ, సిగరెట్, గుట్కాలతోపాటు నమిలే పొగాకు ఉత్పత్తులనూ పోలింగ్ బూత్‌లలో నిషేధించింది. పొగ తాగడంసహా, ఉత్పత్తులపై నిషేధం పూర్తిగా అమలయ్యేలా జిల్లా ఎలక్టోరల్/జిల్లా మెజిస్ట్రేట్లను ఆదేశించాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈసీ లేఖలు రాసింది. ‘దేశంలోని అన్ని పోలింగ్ బూత్‌లు పొగాకురహితంగా ఉండాలి’ అని ఈసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను ప్రకటించిన ఈసీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇరు ప్రాంతాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న వివిధ పార్టీల వివరాలు... ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 653 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - 275 స్థానాలు టీడీపీ -373 స్థానాలు కాంగ్రెస్ -2 స్థానాలు ఇతరులు - 3 స్థానాలు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 10,092 ఎంపీటీసీ స్థానాలకు గాను 10,081 స్థానాల్లో కౌంటింగ్ పూర్తి అయిందని తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - 4,199 స్థానాలు టీడీపీ - 5,216 స్థానాలుకాంగ్రెస్- 172 సీపీఐ - 24, సీపీఎం -14 బీజేపీ -13 బీఎస్పీ - 2 ఇతరులు -431 తెలంగాణ: తెలంగాణలో మొత్తం 440 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్ సీపీ 6 టీఆర్ఎస్-191 కాంగ్రెస్ -176 టీడీపీ 53 బీజేపీ - 4 సీపీఎం 2 సీపీఐ 2 ఇతరులు 6 తెలంగాణలో మొత్తం 6,467ఎంపీటీసీ స్థానాలు వైఎస్ఆర్ సీపీ 121 టీఆర్ఎస్ 1868 కాంగ్రెస్ 2351 బీజేపీ 275 సీపీఎం 145 సీపీఐ 80.. బీఎస్పీ 28 ఇతరులు 545 లోక్‌సత్తా 1