కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మీకు నచ్చలేదా.. మీరు మీ ఓటును ఎవరికీ వేయకుండా తిరస్కరించాలనుకుంటున్నారా.. గతంలో కాకున్నా ఇప్పుడు అది సాధ్యమే.. వచ్చే సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల నిర్వహణలో పలు మార్పులు తీసుకువచ్చింది. నిర్వహణతోపాటు ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)మిషన్‌లలో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులు తీసుకురానుంది. ఈవీఎం మిషన్‌లో ‘నోటా’ అనే బటాన్ అమర్చనుంది. మీకు ఓటు వేయాలని ఉండి పోలింగ్ బూత్‌కు వెళ్లిన తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఈవీఎంలో గల ‘నోటా’ బటన్‌నోక్కితే చాలు.. మీ తిరస్కరణ ఓటు అందులో నమోదు అవుతుంది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సారి ఓటింగ్ యంత్రాలను సరికొత్త పద్ధతిలో రూపొందించింది. ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని ఈ నోటా బటాన్ నొక్కితే చాలు మీకు అబ్యర్థులెవరూ నచ్చలేదని తెలిసిపోతుంది. ఒటరకు ఈ నోటా ఒక వజ్రాయుధంగా మారనుంది. ముఖ్యంగా గతంలో కంటే ఈ ఏడు 18 సంవత్సరాలు నిండిన యువతలో చాలా మార్పు వచ్చింది. ఓటు హక్కును వజ్రాయుధంలా మార్చుకొని సమాజంలో అన్యాయన్ని కూకటి వేళ్లతో పెకిలిద్దామనే సంకేతాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటుద్వారా సమసమాజ నిర్మాణం కోసం యువత ఎదురు చూస్తోంది.
ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ బటన్ తీసుకురావడంపట్ల యువత ఆనందంగా ఉంది. గతంలో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లామంటే అభ్యర్థి నచ్చినా.. నచ్చకున్నా ఎవరికో ఒకరికి ఓటు వేసి వచ్చేవాళ్లు. ఈసారి నోటా రావడంతో యువతకు ఎన్నికలపై ఆసక్తి ఏమేరకు ఉందో తెలియనుంది. ఓటింగ్ యంత్రాల్లో కొత్తగా వస్తున్న ఈ తిరస్కరణాస్త్రంను ఎంత మంది ఉపయోగిస్తారో కూడా నోటా ద్వారా తేలనుంది.
ఈవీఎం గోదాం ప్రారంభం..
నిజామాబాద్ మండలం పాంగ్రా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నం 443లో నిర్మిస్తున్న ఈవీయం మిషన్‌ల గొదాం ప్రారంభానికి సిద్ధమయ్యింది. గతంలో ఈవీఎం, బ్యాలెట్ బాక్సులను నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్‌లోని ఓ హల్లో ఉంచేవారు. వాటికి సెక్యురిటీ సరిగా లేకపొవడంతో గతంలో ఈవీఎం హాల్‌షెట్టర్ ను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు. దీంతో జిల్లా యంత్రాంగం మండలంలోని ప్రభుత్వ భూమిలో ఈవీఎం గొదాం కోసం అప్పటి కలెక్టర్ క్రిస్టినా చోంగ్తూ 1200 గజాల భూమికి ప్రతిపాదనలు సిద్ధం చేసి గోదాం నిర్మాణం కోసం ఈసీ అనుమతి కోసం కోరారు.
కలెక్టర్ కోరిక మేరకు ఈవీఎం, ఎలక్షన్ సామగ్రి కోసం సొంత గోదాం ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈసీ కూడా గోదాం నిర్మాణానికి రూ. 98లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు పనులు ప్రారంభించారు.
సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో గొదాంను త్వరగా పూర్తి చేశారు. గోదాం ప్రారంభం అయితే దాదాపు జిల్లాలోని 2వేలకు పైగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాల్లోనే ఈవీఎం యంత్రాలన్ని ఈ గొదాంలో భద్రపరుచనున్నారు. రెండుమూడు రోజుల్లో ఈవీఎం మిషన్లను భద్రపరిచే గోదాంను ప్రారంభించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.
నచ్చకపోతే ‘నోటా’ నొక్కండి
Published Fri, Feb 28 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement