సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరగడంతోనే సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్న ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో దాదాపు అన్ని పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9.30 గంటల వరకు ఓటింగ్ కొనసాగడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు.
శుక్రవారం వికాస్‌రాజ్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా చోట్ల సాయంత్రం 5 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా.. అప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో నిలబడిన వారందరికీ నిబంధనల ప్రకారం ఓటేసే అవకా శం కల్పించామని వికాస్‌రాజ్ వివరించారు. అందువల్ల ఆయాచోట్ల రాత్రి 9.30 గంటల వరకు పోలింగ్ జరిగిందని, అధికారులు ఈవీఎంలు, ఇత ర సామగ్రిని సర్దుకుని రిసెప్షన్ కేంద్రాలకు చేరు కునే సరికి మరింత ఆలస్యమైందని చెప్పారు.
రిసె ప్షన్ కేంద్రాల్లో ఈవీఎంలకు ప్రాథమిక తనిఖీలు నిర్వహించి, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చినట్టు వెల్లడించారు. ప్రాథమిక స్రూ్కటినీ తర్వాతే 70.6 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రాథమి కంగా అంచనాకు వచ్చామని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు కూర్చుని అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తుది స్రూ్కటినీ నిర్వహిస్తున్నారని వివరించారు.
చాంద్రాయణగుట్ట సహా ఇతర స్థానాల్లో రిగ్గింగ్ జరిగినట్టు వచ్చిన ఫిర్యా దుల మేరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. స్క్రూటి నీ ముగిశాకే కచ్చితమైన పోలింగ్ శాతంతోపాటు రిగ్గింగ్ ఆరోపణల్లో నిజానిజాల పై స్పష్టత వస్తుందని.. ఆయా అంశాల ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.
ప్రశాంతంగా పోలింగ్
చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వికాస్‌రాజ్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలన్నీ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నట్టుగా ధ్రువీకరించుకున్నామ ని వివరించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు.158పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆయాచోట్ల కొత్త ఈవీఎంలను పెట్టి పోలింగ్ నిర్వహించామని.. దీనివల్ల కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 45 నిమిషాల వరకు ఆలస్యమైందని అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్ వివరించారు.
నాగార్జున సాగర్ అంశానికి ఎన్నికలతో సంబంధం లేదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సగభాగాన్ని ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న ఘటనకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. డీప్ ఫేక్, ఇతర తప్పుడు ప్రచారాల ఆరోపణలపై సోషల్ మీడియాలోని 120 లింక్‌లను తొలగించామన్నారు.
ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై విశ్లేషణ జరుపుతామన్నారు. డబ్బులు పంచుతూ కొందరు అభ్యర్థులు, వారి బంధువులు పట్టుబడిన ఘటనలపై స్పందిస్తూ.. రాష్ట్ర మంత్రులపై కేసులు నమోదయ్యాయని, రికార్డు స్థాయిలో 13వేలకుపైగా కేసులు పెట్టామని వికాస్‌రాజ్ వివరించారు.
భారీగా పెరిగిన పోస్టల్ బ్యాలెట్లు
ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ గణనీయంగా పెరిగిందని వికాస్‌రాజ్ తెలిపారు. 16,005 మంది 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు, 9,459 మంది దివ్యాంగ ఓటర్లు, 1.80 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 33 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కేంద్ర బలగాలు, రాష్ట్ర సాయుధ రిజర్వ్‌డ్ బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు.
500కుపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 14+14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. మిగతా స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. 119 స్థానాలకు సంబంధించి 1,766 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయని.. వీటిలో ఆర్‌వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ ఉంటాయని వివరించారు.
ఉదయం 10.30 కల్లా లీడ్‌పై స్పష్టత
కౌంటింగ్‌లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి తర్వాత ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని వికాస్‌రాజ్ తెలిపారు. ఒకవేళ పోస్టల్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడితే.. సమాంతరంగా ఈవీఎం ఓట్ల లెక్కింపూ మొదలవుతుందన్నారు. ఉదయం 10.30 గంటలకల్లా కౌంటింగ్‌లో ముందంజలో ఉన్న అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని వికాస్‌రాజ్ అంచనా వేశారు. కొన్ని స్థానాల్లో అధిక పోలింగ్ జరగడం, చాలాచోట్లలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓట్ల లెక్కింపునకు కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment