వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా సవరణ కోసం 8.67 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్‌రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 8వ తేదీతో గడువు ముగిసిందని, ఆ తర్వా త వచ్చిన దరఖాస్తులను తుదిజాబితా ప్రచురించిన తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన యువత ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకునేవిధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టామని తెలిపారు.
రాష్ట్రంలోని 1,700 కళాశాలల్లో ఉన్న 18–19 ఏళ్ల వయసువారిని లక్ష్యంగా చేసుకుని ఎలక్షన్ లిటరసీ క్లబ్(ఈఎల్‌సీ)లను ఏర్పాటు చేశామని, క్యాంపస్ అంబాసిడర్లను నియమించడంతోపా టు విద్యార్థులందరికీ ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపామని తెలిపారు. గిరిజనుల కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టామని, రాష్ట్రంలోని 361 గిరిజన ఆవాసాల్లో గల కొ లం, తోటి, చెంచు, కొండరెడ్డి తెగలకు చెందిన 2,500 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించామని పేర్కొన్నారు.
విక లాంగ ఓటర్ల కోసం పింఛన్ డేటాతోపాటు సదరం వివరాలు తీసుకున్నామని తెలిపారు. పట్టణప్రాంతాల్లో ఓటరు నమోదు కోసం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారి కి ఎస్‌ఎంఎస్‌లు పంపించామని, వీధి నాటకాల ద్వారా అ వగాహన కల్పించేందుకు ప్రయత్నించామని, పట్టణ ప్రాంతాల్లో ఉండే పారిశుధ్య వాహనాల ద్వారా ఆడియో సందేశాలు పంపామని తెలిపారు. ఈ నెల 8లోపు వచ్చిన దర ఖాస్తులను 26 వ తేదీలోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
జనవరి 5న తుది ఓటరుజాబితా
అక్టోబర్ 1 వ తేదీ తర్వాత 8.67 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 5.66 లక్షల ఫాం–6, 1.83 లక్షల ఫాం–7, 1.17 లక్షల ఫాం–8 దరఖాస్తులున్నాయని వికాస్‌రాజ్ తెలిపారు. ఆన్‌లైన్‌తోపాటు కొన్ని దరఖాస్తులను నేరుగా బీఎల్‌వోలు, ఏఈఆర్‌వోలు, ఈఆర్‌వోలకు ఇచ్చారని, వాటిని డిజిటలైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
అక్టోబర్–1 నుంచి నవంబర్–9 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓటరు నమోదు, అభ్యంతరాలను డిసెంబర్ 30లోపు పరిశీలించి పరిష్కరిస్తామని వికాస్‌రాజ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment