
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.
కౌంటింగ్ రోజున మద్యం షాపులు బంద్ అవుతాయన్నారు. తెలంగాణలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని సీఈవో వెల్లడించారు.
34 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని.. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేశామన్నారు. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని సీఈవో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment