డిసెంబర్‌ 30న ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా  | MLC Final Voter List On 30th December In Telangana: CEO Vikas Raj | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 30న ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా 

Published Wed, Nov 9 2022 2:08 AM | Last Updated on Wed, Nov 9 2022 2:08 AM

MLC Final Voter List On 30th December In Telangana: CEO Vikas Raj - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి–హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7 తర్వాత కూడా కొనసాగుతుందని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 7తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా, నవంబర్‌ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది.

ఆ తర్వాత నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 9 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించాలి. అయితే, ఈ నెల 7 నుంచి 23 మధ్య వ్యవధిలో సైతం కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్‌ 30న ప్రకటించనున్న తుది ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తామని వికాస్‌రాజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement