సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుందని తెలిపారు.
ఈ పర్యటనలో దాదాపు 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల చెకింగ్ జరుగుతోందని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. అధికారిక పార్టీ పూర్తి అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: మీడియా కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ
Comments
Please login to add a commentAdd a comment