సాక్షి, సిటీబ్యూరో: అధునాతన సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలతో దేశంలోనే అత్యున్నత ఇన్నోవేటివ్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోంది. ఈ ఆవిష్కరణల్లో హైదరాబాద్ నగరం వేదికగానే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఇన్నోవేటర్స్ తమవంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ వినూత్న ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్‌ఐసీ), ఐటీఈ–సి’ శాఖలు కీలకంగా పని చేస్తున్నాయి. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ వేదికలు కృషి చేస్తున్నాయి.
ఇందులో భాగంగా 2019లో టీఎస్‌ఐసీ ఆధ్వర్యంలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో ఉన్నటువంటి ఆవిష్కర్తలను వెలికితీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగోవడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 700 పైగా ఇన్నోవేటర్స్ తమ విభిన్న ఆవిష్కరణలను ప్రదర్శించారు.
ఈ ఏడాది కూడా ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమం కోసం ఆవిష్కర్తల దరఖాస్తులను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆహా్వనిస్తోంది. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌ఐసీ ప్రకటించింది. ఔత్సాహికులు తమ పేరు, ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో, నాలుగు ఫొటోలను 9100678543 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు.
టీఎస్‌ఐసీ సహకారం
2020 ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శలో భాగంగా విత్తనాలు ఉన్న పేపర్ నాప్కిన్స్‌ను తయారు చేశాను. ప్రతిరోజు ఇంట్లో ఉండే తడి చెత్తను కంపోస్ట్ పిట్‌లో పెట్టడంతో దుర్వాసన వచ్చేది. ఆ సమయంలో వచ్చిన ఈ ఆలోచనతో దీనిని తయారు చేశాను. ఈ పేపర్‌ను మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో విత్తనాలు కూడా ఉండడంతో కొత్త మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించిన టీఎస్‌ఐసీ అప్పటినుంచి సహకారం అందిస్తున్నారు.
–అరుణ్ జ్యోతి, గృహిణి, నల్గొండ జిల్లా
అకుంర దశలోనే ప్రోత్సాహం..
33 జిల్లాలో ఎంతో మంది ఇన్నోవేటర్స్ ఉన్నారు, వారికీ సరైన సహకారం, దిశానిర్దేశం చేయడానికి ఈ వేదిక రూపొందించబడింది. ఏ ఆవిష్కరణకైనా అకుంర దశ నుంచి ప్రోత్సహించాలి. టీఎస్‌ఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, భాగస్వాముల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఆవిష్కర్తలను గుర్తిస్తూ వారి జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నాం. ప్రతీ ఒక్కరూ వినూత్నంగా ఆలోచించాలి, వారి ఆవిష్కరణలతో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాం. ఎంపికైనవారికి ఆగష్టు 15 స్వత్రంత దినోత్సవ సంబరాలలో తమ ఆవిష్కరణ ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
–డా. శాంతా తౌటం, తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment