సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు (మే13)న అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని తెలిపారు.
బందోబస్తు కోసం కేంద్ర బలగాలతో పాటు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని వికాస్‌రాజ్ వెల్లడించారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు సీజ్ చేశామని, తనిఖీలకు సంబంధించి 8 వేలకు పైగా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న సీఈవో వికాస్‌రాజ్.. పోలింగ్ సమయం దగ్గర పడటంతో నిఘా మరింత పెంచామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment