
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లకు ఎరవేసేం దుకు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి భారీగా డబ్బులను తరలిస్తున్నారని, ఆయా రాష్ట్రాల సరిహ ద్దుల వెంట పటిష్ట నిఘా ఉంచి కట్టడి చేయాలని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ కుమార్ ఎన్నికల అధికారులను కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ మంగళ వారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశమై వారి అభి ప్రాయాలు, సూచ నలను సేకరించారు.
అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. సోమ భరత్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలతో కొందరు చెలరేగి పోతున్నారని, అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్‌పై రాజకీయ పార్టీల గుర్తులను వృద్ధులు సులువుగా గుర్తు పట్టేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో సరైన వెలుతురు సదుపాయం కల్పించాలన్నారు.
ప్రగతిభవన్‌లో బీ–ఫారాల పంపిణీపై విచారణకు ఆదేశం..
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ–ఫార్మ్‌లు పంపిణీ చేయడాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్య క్షులు జి.నిరంజన్ ఫిర్యాదు చేశారు. ప్రగతిభవన్ పబ్లిక్ ప్రాపర్టీ అని, అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం విచా రణకు ఆదేశించిందన్నారు.
అక్టోబర్ 4న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాకు తోడుగా త్వరలో అనుబంధ ఓటర్ల జాబితాను సైతం ప్రచురిస్తామని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారన్నారు. ఓటర్లుగా దర ఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఎన్ని కల నిబంధనలపై సరైన అవగాహన లేదన్నారు.
రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమ తుల జారీపై స్వయంగా ఎన్నికల సంఘమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాంపల్లి నియోజక వర్గంలో బోగస్ ఓట్లను తొలగించాలని కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కోరారు. సజావుగా ఎన్నికలు జరిపేందుకు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను దింపాలని సూచించారు.
ఆ అధికారులను బదిలీ చేయాలి.. బీజేపీ
బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికా రులను బదిలీ చేయాలని బీజేపీ నేత అంథోని రెడ్డి కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికల పరిశీలకు లను, కేంద్ర బలగాలను దించాలని సూచించారు.
మునుగోడులో జప్తు చేసిన డబ్బు ఏమైంది?
ఇటీవల ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహా రావు కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో జప్తు చేసిన డబ్బులను ఏం చేశారని ప్రశ్నించారు. పోలింగ్‌కు 5 రోజుల ముందు ఓట ర్లందరికీ స్లిప్పులు జారీ చేయాలని సూచించారు. బోగస్ ఓట్లను తొలగించాలని, అక్రమ డబ్బు తరలింపును కట్టడి చేయాలని టీడీపీ నేత సతీష్ సూచించారు.
ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో మద్యం విక్రయా లను నిషేధించాలని, ఓటును ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలని ఆప్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు జరపాలని ప్రజాశాంతి పార్టీ కోరింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులపై సీఈఓకి ఫిర్యాదు చేసినట్టు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానంద్ రావు తెలిపారు. అలాగే పాతబస్తీలో బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment