ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: డాక్టర్‌ గంగిడి మనోహర్‌ రెడ్డి | Munugodu BJP Candidate Gangidi Manohar Reddy Interview | Sakshi
Sakshi News home page

ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: డాక్టర్‌ గంగిడి మనోహర్‌ రెడ్డి

Published Mon, Dec 3 2018 9:33 AM | Last Updated on Mon, Dec 3 2018 9:37 AM

Munugodu BJP Candidate Gangidi Manohar Reddy Interview - Sakshi

మనుగోడు బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి

సాక్షి, సంస్థాన్‌ నారాయణపురం (మునుగోడు) : మునుగోడు నియోజకవర్గం రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ పనిచేసిన  కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఎంత సేపటికీ తమ స్వలాభం చూసుకున్నారు.. కానీ ప్రజల కష్టాలనుు పట్టించుకోలేదు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే బీజేపీని కోరుకుంటున్నారు. నిత్యం గ్రామాల్లో తిరిగే నాకు సమస్యలు తెలుసు. ఎ గ్రామాల్లో ఏ సమస్య ఎప్పటి నుంచో ఉందో నాకు తెలుసు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్‌ను ఇప్పటికీ పరిష్కరించలేదు. నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులకు కల్పించి మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా అంటున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి . 
సాక్షి : మీ విజయానికి కలిసోచ్చేఅంశాలు ఎమిటీ.?
గంగిడి మనోహర్‌రెడి : నియోజవర్గంలోని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడిని. ప్రతి రోజు తండాలు, గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుకుంటా. ఆపద, సాపద వచ్చిన అందుబాటులో ఉంటూ ఆదుకొంటున్నా. పార్టీలకు అతీతంగా, వివాదరహితుడుగా మంచి పేరు ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పథకాలతో సమగ్ర అభివృద్ధి జరుగుతుంది.  కాంగ్రెస్‌ అభ్యర్థి ఇక్కడ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన ఏమి చెయ్యని అసమర్థడు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యేగా పనిచేసే సమయంలో అనేక అవనీతి ఆరోపణలు ఉన్నాయి. వీరు చెప్పకోవాడనికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలే దు. నా విజయానికి అన్ని అంశాలు కలిసివచ్చేవే.
సాక్షి : నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు గుర్తించారు.?
నియోజకవర్గంలో అనేక సమస్యలు రాజ్యామేలుతున్నాయి. ఇక్కడి ప్రజల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడానికి ఎలాంటి చర్యలు లేవు. ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉంది. శ్వాశత పరిష్కారానికి సాగు, తాగు జలాలు సదుపాయాలు కల్పించాడానికి వేగవంత చేస్తాం. నాణ్య మైన విద్యా అందడం లే దు. వైద్య సౌకర్యాలు లేవు. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. నక్కల గండి ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. ఇక్కడి ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి లేక వలసపోతున్నారు. స్థానికుల పరిశ్రమలో ఉద్యోగాలు లభించడం లేదు.  గట్టుప్పుల్‌ మండలం ఇస్తామని ఇవ్వలేదు.ఇలా ఎన్నో సమస్యలు నియోజకవర్గంలో తిష్ట వేశాయి.
సాక్షి: విజయం సాధిస్తే ఏం చేస్తారు..?
మనోహర్‌రెడ్డి : మనుగోడు నియోజకవర్గంలో ఇప్పటికి చూడని అభివృద్ధి అంటే ఎమిటో చేసి చూపిస్తాను. నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మంచి మేనిఫెస్టో తయారు చేశా. అది అమలు చేస్తాను. నక్కలగండి ప్రాజెక్టును పూర్తి చేసి నియెజకవర్గంలో సాగు, తాగు జలాలు అందించి సస్యశ్యామలం చేస్తా. చౌటుప్పల్‌లో ట్రామా కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తా, నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తా. బస్‌ డిపోను ఏర్పాటు చేస్తా. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధివకాశాలను కల్పిస్తా. ప్రజల్లో జీవన ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు చేపడుతా. డీగ్రి, జూని యర్‌ కళాశాలను ఏర్పాటు చేస్తాను. నాణ్యమైన విద్యను అందించాడానికి కృషి చేస్తా. గట్టుప్పుల్‌ మండలంగా ఏర్పాటు చేస్తాం. మైసమ్మ కత్వాను ఏర్పాటు చేసి చెరువులను నింపుతాము. రైతుల ప్రయోజనం కోసం కృషిచేస్తాను. అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను.
సాక్షి : ప్రజలకు మీరు ఇచ్చే సందేశం..?
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్‌ పార్టీ గెలిచినప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, మంత్రులుగా, ఎంపీగా ఉన్నారు కాని అభివృద్ధి చేయడనికి వీరి నిర్లక్ష్యం కారణం. సభల్లో ప్రాతినిథ్యం ఉన్న ఇరు పార్టీలు ఎన్నడూ మునుగోడు సమస్యలపై ప్రశ్నంచలేదు. నిమోజకవర్గం సమస్యల ను తెలిసిన నాయకుని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నన్ను గెలింపించమని కోరుతున్నా.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement