gangidi manohar reddy
-
Praja Sangrama Yatra: ప్రజల గోస అరుసుకోవాలనే!
తెలంగాణలో మెజారిటీ వర్గాల ప్రయోజనాల కోసం ‘బీసీ బంధు’, అణగారిన ఎస్టీ బిడ్డల కోసం ‘గిరిజన బంధు’ను తీసు కురావడమే లక్ష్యంగా, సకల జనులు కలలుగన్న తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఐదో విడత నవంబర్ 28న ప్రారంభమయ్యింది. భావి సామాజిక తెలంగాణ కోసం బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల్లో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన్రు. గతేడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రకు, టీఆర్ఎస్ప్రభుత్వం అడుగడు గున అడ్డంకులు సృష్టించింది. అయినా వెనకడుగు వెయ్య కుండా, వెన్ను చూపకుండా ఇప్పటి వరకు విడతలుగా 21 జిల్లాల్లో 1,178 కిలోమీటర్లు నడిచి బండి సంజయ్ తెలంగాణ ప్రజల మనసులు గెలుచు కున్నారు. నవంబర్ 28న నిర్మల్‌లోని ఆడెల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఆశేష జనవాహిని మధ్య ముధోల్ నుంచి పాదయాత్ర ప్రారం భమయింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల సహా... ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో 225 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాద యాత్ర డిసెంబర్ 17న, కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తది. టీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల ఏలుబడిలో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలే. మన పొలాలకు నీళ్లు రాలే. మన డబ్బా ఇండ్లు డబుల్ బెడ్రూం కాలే. మన ఊరికి నిధులు రాలే. మన రైతుల అప్పులు తీరలే. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడలే. తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి అనీ, దళితులకు మూడెకరాల భూమి ఇస్తమనీ దళితులను మోసం చేసిన్రు. కేజీ టు పీజీ ఉచిత విద్య మాటలకే పరిమితమైంది. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువుల హామీలు అమలుకే నోచుకోలే. బీసీ రుణాలను మూలకు పడేసి ఐదేండ్లు కావొస్తున్నది. పోడు భూముల్లో మొక్కలు నాటాలని ఒక వైపు అధికారులకు ఆదేశాలు ఇచ్చేదీ ప్రభుత్వమే. ఇంకోవైపు పోడు భూములకు పట్టాలిస్తామని ఆశ పెట్టేదీ ముఖ్యమంత్రే. ఈ రెండు నాలుకల నిర్వాకం వల్ల అధికారులు, పోడు రైతుల మధ్య గొడవలయ్యి, అమాయకుల ప్రాణాలు పోతున్నయ్. (చదవండి: ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి) భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని, మౌలిక లక్ష్యాలైన జాతీయవాదం, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్యం, సామాజిక ఆర్థిక వ్యవస్థకు గాంధేయ విధానాలను అన్వ యించడం విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తం. దోపిడీ నుంచి విముక్తి, సమానతపై ఆధారపడ్డ సమాజం (‘సమతా యుక్త్, శాసన్ ముక్త్’)తో పాటు, విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేస్తం. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పార్టీగా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ బిల్లుకు సహకరించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీజేపీకి తెలంగాణ ఆకాంక్షలపై స్పష్ట మైన అవగాహనతో పాటు, అవసరమైన ప్రణాళికలు ఉన్నయ్. ప్రజారంజక పాలన తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొనాలని స్వాగతిస్తున్నం. (చదవండి: ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?) - డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఉపాధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ (‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ 5వ విడత సందర్భంగా) -
ఆకుపచ్చ హామీ ఏమైంది?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రాంతంలో 1.75 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే డిండి ఎత్తిపోతల పథ కాన్ని ఒకటిన్నరేళ్లలో పూర్తిచేసి మునుగోడును ఆకుపచ్చగా చేసే బాధ్యత తనదేనని చెప్పిన సీఎం కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2018 ఎన్నికల ప్రచారానికి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో వచ్చి గాలిమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ తాయిలాలకు తెరలేపార న్నారు. ప్రగతిభవన్, ఫాం హౌస్ దాటని కేసీఆర్.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల కోసం పరుగులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీసీరోడ్లకు ప్రతిపాదనలు, మునుగోడు నియోజకవర్గంలో 9 వేల ఆసరా పెన్షన్లు, డిండి లిఫ్టు నిర్వాసితులకు రూ.116 కోట్లు, చేనేత కార్మికులకు బీమా, పెన్షన్లు వస్తున్నాయని, రోడ్లు, బ్రిడ్జి పనులకు రూ.7 కోట్లు వస్తున్నా యని తెలిపారు. -
ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి
సాక్షి, సంస్థాన్ నారాయణపురం (మునుగోడు) : మునుగోడు నియోజకవర్గం రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ పనిచేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఎంత సేపటికీ తమ స్వలాభం చూసుకున్నారు.. కానీ ప్రజల కష్టాలనుు పట్టించుకోలేదు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే బీజేపీని కోరుకుంటున్నారు. నిత్యం గ్రామాల్లో తిరిగే నాకు సమస్యలు తెలుసు. ఎ గ్రామాల్లో ఏ సమస్య ఎప్పటి నుంచో ఉందో నాకు తెలుసు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్‌ను ఇప్పటికీ పరిష్కరించలేదు. నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులకు కల్పించి మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపిస్తా అంటున్నారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి . సాక్షి : మీ విజయానికి కలిసోచ్చేఅంశాలు ఎమిటీ.? గంగిడి మనోహర్‌రెడి : నియోజవర్గంలోని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడిని. ప్రతి రోజు తండాలు, గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుకుంటా. ఆపద, సాపద వచ్చిన అందుబాటులో ఉంటూ ఆదుకొంటున్నా. పార్టీలకు అతీతంగా, వివాదరహితుడుగా మంచి పేరు ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పథకాలతో సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన ఏమి చెయ్యని అసమర్థడు, టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యేగా పనిచేసే సమయంలో అనేక అవనీతి ఆరోపణలు ఉన్నాయి. వీరు చెప్పకోవాడనికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలే దు. నా విజయానికి అన్ని అంశాలు కలిసివచ్చేవే. సాక్షి : నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు గుర్తించారు.? నియోజకవర్గంలో అనేక సమస్యలు రాజ్యామేలుతున్నాయి. ఇక్కడి ప్రజల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడానికి ఎలాంటి చర్యలు లేవు. ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. శ్వాశత పరిష్కారానికి సాగు, తాగు జలాలు సదుపాయాలు కల్పించాడానికి వేగవంత చేస్తాం. నాణ్య మైన విద్యా అందడం లే దు. వైద్య సౌకర్యాలు లేవు. గ్రామాల్లో మౌలిక వసతులు లేవు. నక్కల గండి ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. ఇక్కడి ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి లేక వలసపోతున్నారు. స్థానికుల పరిశ్రమలో ఉద్యోగాలు లభించడం లేదు. గట్టుప్పుల్ మండలం ఇస్తామని ఇవ్వలేదు.ఇలా ఎన్నో సమస్యలు నియోజకవర్గంలో తిష్ట వేశాయి. సాక్షి: విజయం సాధిస్తే ఏం చేస్తారు..? మనోహర్‌రెడ్డి : మనుగోడు నియోజకవర్గంలో ఇప్పటికి చూడని అభివృద్ధి అంటే ఎమిటో చేసి చూపిస్తాను. నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మంచి మేనిఫెస్టో తయారు చేశా. అది అమలు చేస్తాను. నక్కలగండి ప్రాజెక్టును పూర్తి చేసి నియెజకవర్గంలో సాగు, తాగు జలాలు అందించి సస్యశ్యామలం చేస్తా. చౌటుప్పల్‌లో ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తా, నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తా. బస్ డిపోను ఏర్పాటు చేస్తా. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధివకాశాలను కల్పిస్తా. ప్రజల్లో జీవన ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు చేపడుతా. డీగ్రి, జూని యర్ కళాశాలను ఏర్పాటు చేస్తాను. నాణ్యమైన విద్యను అందించాడానికి కృషి చేస్తా. గట్టుప్పుల్ మండలంగా ఏర్పాటు చేస్తాం. మైసమ్మ కత్వాను ఏర్పాటు చేసి చెరువులను నింపుతాము. రైతుల ప్రయోజనం కోసం కృషిచేస్తాను. అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను. సాక్షి : ప్రజలకు మీరు ఇచ్చే సందేశం..? మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలి. కాంగ్రెస్, టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, మంత్రులుగా, ఎంపీగా ఉన్నారు కాని అభివృద్ధి చేయడనికి వీరి నిర్లక్ష్యం కారణం. సభల్లో ప్రాతినిథ్యం ఉన్న ఇరు పార్టీలు ఎన్నడూ మునుగోడు సమస్యలపై ప్రశ్నంచలేదు. నిమోజకవర్గం సమస్యల ను తెలిసిన నాయకుని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నన్ను గెలింపించమని కోరుతున్నా. -
కేసీఆర్ గద్దె దిగక తప్పదు
సాక్షి, మునుగోడు : గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా విస్మరించిన సీఎం కేసీఆర్ గద్దె దిగక తప్పదని బీజేపీ మునుగోడు అసెంబ్లీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, పలివెల, కోతులారం తదితర గ్రామాలల్లో మంగళవారం తన కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,, దళితులకు మూడు ఎకరాల భూమి, ప్రతి ఇంటికి ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు, కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అందిస్తానని వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. హామీలను విస్మరించిన ఆ పార్టీ నాయకులకు నేడు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. తన కుటుంబాన్ని తప్పా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్‌కు తగిన బుద్ధిచెప్పాలని అన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలనకు నిత్యం శ్రమిస్తున్న బీజేపీని గెలిపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. వ్యాపారాలు తప్పా రాజకీయాలు తెలియని మహాకూటమి అభ్యర్థి సంతలో గొర్రెలను కొనుగోలు చేసినట్లు నాయకులను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. గతంలో ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశాడో తెలియచేయాలని డిమాండ్ చేశారు. సినిమా డైలాగులతో ప్రజలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. కానీ ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. అధికార పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థికి కమీషన్లు తప్పా ప్రజల సమస్యలు పట్టవన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుకు గురైన మునుగోడును ఏ పార్టీ ప్రజా ప్రతినిధి పట్టించుకోలేదన్నారు. కనీసం ప్రభుత్వ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రతి గ్రామానికి సరైన రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేయించలేని ఆ ఇరువురు నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మంచుకొండ రాంమూర్తి, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపినాథ్, మండల అధ్యక్షుడు బొడిగే అశోక్‌గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సోమ నర్సింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షంగౌడ్, రాష్ట్ర నాయకుడు భవనం మధుసూదన్‌రెడ్డి, నాయకులు నకిరకంటి నర్సింహ్మగౌడ్, బొల్గూరి రమేష్, కంభంపాటి నర్సింహ, దుబ్బ జెల్లయ్య, మాదగోని నరేందర్‌గౌడ్, గజ్జల బాలరాజుగౌడ్, నీరుడు రాజారాం, ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, సతీష్ పాల్గొన్నారు. అదే విధంగా ఇప్పర్తి శివాలయంలో పూజలు చేశారు. -
గంగిడి మనోహర్‌రెడ్డి - లీడర్‌తో
-
గట్టుప్పల్‌లో బీజేపీ నేత అరెస్టు
చండూరు: నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బొడిగె సోని కుటుంబాన్ని పరామర్శించటానికి ఆయన శనివారం మధ్యాహ్నం గట్టుప్పల్‌కు చేరుకున్నారు. అయితే, గ్రామంలో 144వ సెక్షన్ అమల్లో ఉన్నందున పరామర్శ వీలుకాదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆయన్ను అరెస్టు చేసి చండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.