సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రాంతంలో 1.75 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే డిండి ఎత్తిపోతల పథ కాన్ని ఒకటిన్నరేళ్లలో పూర్తిచేసి మునుగోడును ఆకుపచ్చగా చేసే బాధ్యత తనదేనని చెప్పిన సీఎం కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2018 ఎన్నికల ప్రచారానికి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో వచ్చి గాలిమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ తాయిలాలకు తెరలేపార న్నారు. ప్రగతిభవన్, ఫాం హౌస్ దాటని కేసీఆర్.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల కోసం పరుగులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీసీరోడ్లకు ప్రతిపాదనలు, మునుగోడు నియోజకవర్గంలో 9 వేల ఆసరా పెన్షన్లు, డిండి లిఫ్టు నిర్వాసితులకు రూ.116 కోట్లు, చేనేత కార్మికులకు బీమా, పెన్షన్లు వస్తున్నాయని, రోడ్లు, బ్రిడ్జి పనులకు రూ.7 కోట్లు వస్తున్నా యని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment