
మాట్లాడుతున్న ప్రమోద్‌రెడ్డి
సాక్షి,మునుగోడు : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో నిలిస్తే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతాడనే భయంతో రాజగోపాల్‌రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తున్నారని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చీకటిమామిడి గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ గత మంగళవారం చండూరులో నిర్వహించిన సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి కొన్ని పార్టీల నాయకులు తమ స్వార్థం కోసం యువతను వాడుకొని మద్యానికి బానిసలు చేస్తున్నారని, వారిని కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు తప్పా, యువత తాగుబోతులని ఎక్కడా అనలేదన్నారు. కావాలనే టీఆర్‌ఎస్ నాయకులు అతనిపై బురద చల్లేందుకు తాగుబోతులని అన్నాడని ఆరోపించారు. ఎవ్వరూ ఎన్ని కుట్రలు పన్నినా రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి బరిలో నిలచి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జీడిమెట్ల బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు పగిళ్ల నగేష్, ఉపాధ్యక్షుడు తాటికొండ లింగస్వామి, కార్యదర్శి పాలకూరి వెంకటేష్, తాటికొండ నర్సింహ, మారగోని శ్రీనివాస్, పల్లె సైదులు, అనంత సురేష్, సాయి, కాటేష్, మునుకుంట్ల సాయి, చెన్నగోని సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment