ఏనుగు వచ్చిందోచ్! | elephant brought for patsify in nimajjanam celebration of Ganesha | Sakshi
Sakshi News home page

ఏనుగు వచ్చిందోచ్!

Published Mon, Sep 8 2014 10:35 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

వినాయకుడి ఊరేగింపులో పాల్గొనేందుకు గజేంద్రుడిని తీసుకు వస్తున్న లారీ దారితప్పి నేరేడ్‌మెట్‌లో ఆగిపోవడంతో సుమారు ఆరు గంటల పాటు ఈ ప్రాంతంలో సందడి నెలకొంది.

 యాప్రాల్: వినాయకుడి ఊరేగింపులో పాల్గొనేందుకు గజేంద్రుడిని తీసుకు వస్తున్న లారీ దారితప్పి నేరేడ్‌మెట్‌లో ఆగిపోవడంతో సుమారు ఆరు గంటల పాటు ఈ ప్రాంతంలో సందడి  నెలకొంది. వివరాల్లోకి వెళితే... శంషాబాద్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన వేడుకలలో పాల్గొనేందుకు గుల్బర్గా నుంచిలారీలో ఏనుగును తీసుకువచ్చారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఆ వాహనం దారి తప్పి నేరేడ్‌మెట్ చేరుకుంది. ఇంతలో లారీ మరమ్మతులకు గురవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రోడ్డుపైనే లారీ నిలిచిపోయింది. దీంతో లారీలో ఉన్న గజేంద్రుడిని చూడడానికి చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు, రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు గుమిగూడారు. పండ్లు, ఎలక్కాయలు ఆహారంగా వేస్తూ చిన్నారులు ఆనందంగా గడిపారు. కొందరు తమ సెల్‌ఫోన్‌లలో ఫోటోలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement