అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతీయువకులు అరెస్ట్ | 9 arrested in vulgar dance at Hyderabad city outskirts | Sakshi
Sakshi News home page

అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతీయువకులు అరెస్ట్

Published Sun, Oct 26 2014 12:12 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

యువతీయువకులు అశ్లీల నృత్యాలు చేసిన అపార్ట్మెంట్ - Sakshi

యువతీయువకులు అశ్లీల నృత్యాలు చేసిన అపార్ట్మెంట్

హైదరాబాద్ : నగర శివారులోని ఓ అపార్ట్మెంట్పై పోలీసులు దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతీయువకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సంఘటన నగరం శివారులోని జవహర్నగర్ యాప్రాల్ రిజిస్ట్రేషన్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో యువతీయువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ఆ అపార్ట్మెంట్పై దాడి చేసి అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిలో ముగ్గురు యువతులు, ఆరుగురు యువకులు ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే కార్లను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. యువతీయువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన ముగ్గురు యువతులు పక్క రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement