సాక్షి, మేడ్చల్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించినప్పటికీ.. కొడుక్కి సీటు దక్కలేదనే కారణంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళో, రేపే ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖరారు అయ్యింది కూడా. దీంతో.. మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో..
బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక ఇంఛార్జి అయిన మర్రి రాజశేఖర్‌రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపించారు. ఈయన మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి అల్లుడు కూడా. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి రాజశేఖర్‌రెడ్డి ఓడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనే అంశం ఆధారంగా టికెట్ కేటాయించింది బీఆర్‌ఎస్ అధిష్టానం.
ఈ మేరకు నేడు బీఆర్‌ఎస్ భారీ బలప్రదర్శనకు సిద్ధమైంది. బుధవారం ఉదయం మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకూ సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment