Malkajgiri Assembly Constituency
-
రేవంత్ వర్సెస్ కేటీఆర్.. ఆసక్తిగా మల్కాజిగిరి పోరు
లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలోని కీలక రాజకీయ నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజకీయ భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఈ పోరులో పైచేయి సాధించడం కోసం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తోన్న ఇద్దరు ఉద్దండులు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేతలెవరో కాదు ఒకరు పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా.. మరొకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఇరువురి ఎత్తుగడలు ఎంత మేర ఫలిస్తాయో.. ఫలితాలెలా వస్తాయో జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే! సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక్కడి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిని గెలిపించారు. ఈ సీటును తిరిగి ఈసారి ఎన్నికల్లో దక్కించుకోవడం రేవంత్‌కు కత్తిమీద సాములా మారింది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడం.. ఈ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకపోవడం.. ఈ పరిస్థితుల్లో ఎంపీ సీటును కై వసం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. చేరికలను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ బలహీనపరిచే దిశగా పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని.. ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉన్న రేవంత్‌రెడ్డి.. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం ద్వారా పట్టు నిలుపుకోవాలనే భావనలో ఉన్నారు. అలాగే ఈ గెలుపుతో విమర్శకుల నోటికి తాళం పడుతుందనే అంచనాలో ఉన్నారు. మరోవైపు చేవెళ్ల లోక్‌సభ స్థానంపై రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఈ సెగ్మెంట్లో పాగా వేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మల్కాజిగిరికి ఖరారు చేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష గులాబీ శిబిరాన్ని కకావికలం చేశారు. ► కేవలం ఇక్కడే కాకుండా మల్కాజిగిరి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ ముందుకొచ్చినా.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గేలా చేశారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జిగా చేవెళ్ల, సిట్టింగ్ ఎంపీగా మల్కాజిగిరి స్థానాలను గెలుచుకోవడం రేవంత్‌రెడ్డి ముందున్న పెద్ద సవాల్‌గా భావించవచ్చు. చేవెళ్లలోనూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరేలా ఇప్పటికే మంతనాలు సాగించారు. వీరి చేరికతో పార్టీని బలోపేతం చేయవచ్చని ఆయన అంచనా వస్తున్నారు. సికింద్రాబాద్ స్థానానికి దానం నాగేందర్‌ను ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ను ఇరకాటంలోకి నెట్టారు. గులాబీలో గుబులు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ సమీకరణలు బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఓటమి నుంచి తేరుకోకముందే.. ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు అభ్యర్థులెవరూ ముందుకు రాకపోవడం.. ప్రకటించిన తర్వాత పార్టీ ఫిరాయించడం గులాబీ శిబిరాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎట్టకేలకు మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా.. ఈ రెండు సీట్లను గెలుచుకోవడం మాజీ మంత్రి కేటీఆర్‌కు తలకుమించిన భారంగా పరిణమించింది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ ప్రత్యర్థిగా మారడం.. మల్కాజిగిరి బలమైన మల్లారెడ్డి ఫ్యామిలీ పోటీకి దూరంగా ఉండడం పార్టీ శ్రేణులను నైరాశ్యంలో పడేసింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తరచూ ఈ నియోజకవర్గాల నేతలతో గులాబీ దళపతి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌తో సమావేశమవుతున్నారు. ప్రచార పర్వంలో అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేస్తున్నారు. మల్కాజిగిరి స్థానాన్ని వశం చేసుకోవడం ద్వారా రేవంత్‌పై పైచేయి సాధించాలని, తద్వారా ఆయనను రాజకీయంగా ఇరుకున పడేయాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. కష్టకాలంలో పార్టీని వీడిన సునీత, రంజిత్, దానంలను ఓడించడం ద్వారా పీసీసీ చీఫ్‌ను ఇరకాటంలోకి నెట్టవచ్చని అంచనా వేస్తోంది. -
‘మల్కాజిగిరి’కి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ అభ్యర్థులుగా పోటీలో ఉంటారనుకున్న నేతలు బరి నుంచి తప్పుకొంటుంటే.. మరోవైపు కొత్తవారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొందరు నేతలు, ఎంపీలు.. మరో పార్టీలో చేరి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో, నాగర్‌కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. చేవెళ్ల నుంచి పోటీచేయబోనని సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. తాజాగా మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల బరి నుంచి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం తప్పుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కూల్చివేతతో.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల భవనాలను అక్రమ నిర్మాణాలంటూ ప్రభు త్వం గురువారం కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనితో మల్కాజిగిరిలో రాజకీయాలపై ప్రభావం పడింది. వాస్తవానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం జరిగింది. పార్లమెంటు పరిధి లో భద్రారెడ్డి పేరిట ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు కూడా వెలిశాయి. కానీ గత రెండు రోజుల్లో పరిణామాలు మారి పోయాయి. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి చర్చించారు. కానీ అధికారులు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో కళాశాల భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మల్లారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని.. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోపించారు. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. గురు వారం రేవంత్ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలవడంపై, పార్టీ మారుతున్నట్టు జరిగిన ప్రచారంపై కేటీఆర్‌కు వివరణ ఇచ్చారు. తాను పార్టీ మార డం లేదని తెలిపారు. తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంలో కలిశామని వివరించారు. ఇదే సమయంలో తమ కు టుంబం లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా లేదని కేటీఆర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆస్తులపై దాడులకు భయపడేనా? సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహి ంచిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీకోసం 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీచేయడం దాదాపు ఖరారైంది. కానీ మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పై దాడుల నేపథ్యంలో ఈ సీటు నుంచి తమ కుటుంబసభ్యులెవరూ పోటీ చేయబోరని మల్లారెడ్డి పేర్కొనడం చర్చనీయాంశమైంది. -
మల్కాజ్‌గిరిలో ఇవాళే బీఆర్ఎస్ బలప్రదర్శన
సాక్షి, మేడ్చల్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించినప్పటికీ.. కొడుక్కి సీటు దక్కలేదనే కారణంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళో, రేపే ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖరారు అయ్యింది కూడా. దీంతో.. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఇంఛార్జి అయిన మర్రి రాజశేఖర్‌రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపించారు. ఈయన మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి అల్లుడు కూడా. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి రాజశేఖర్‌రెడ్డి ఓడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనే అంశం ఆధారంగా టికెట్ కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ మేరకు నేడు బీఆర్ఎస్ భారీ బలప్రదర్శనకు సిద్ధమైంది. బుధవారం ఉదయం మల్కాజ్గిరి ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకూ సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఉండనున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా: మైనంపల్లి
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలోనే ఆయన కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తెలియశారు. ‘‘ఈనెల 27న సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నా. మల్కాజిగిరి, మెదక్ టికెట్ నాకు, నా కుమారుడికి, అలాగే.. మేడ్చల్ టికెట్ నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు ఇవ్వమని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరాను. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గాలికి పెద్ద వాళ్లు కొట్టుకుపోవడం ఖాయం అని మైనంపల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు మైనంపల్లిని అఫీషియల్‌గా పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ తదితరులు దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి చేరుకుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మీట్లో పాల్గొని చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల కిందట బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా ప్రకటించారు. తనకు మల్కాజ్గిరి, తన కొడుక్కి మెదక్ సీట్ల ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. మైనంపల్లితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మైనంపల్లితో కాంగ్రెస్ కీలక నేతలు దఫదఫాలుగా చర్చలు జరిపారు. చివరకు తండ్రీకొడుకులకు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. -
మల్కాజిగిరి నియోజకవర్గానికి పాలకుడు ఎవరు?
మల్కాజిగిరి నియోజకవర్గం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మైనంపల్లి హనుమంతరావు ఘన విజయం సాదించారు. గతంలో ఆయన ఒకసారి రామాయంపేట ఉప ఎన్నికలోను, ఆ తర్వాత మెదక్ నుంచి అసెంబ్లీకి టిడిపి పక్షాన గెలిచారు. 2014 లో టిఆర్ఎస్ లో చేరి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 2018 ఎన్నికలలో అసెంబ్లీకి మల్కాజిగిరి నుంచి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావుపై 73698 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇక్కడ నుంచి తెలంగాణ జనసమితి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కు 34 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ జనసమితి మహాకూటమిలో భాగంగా ఉంది.మైనంపల్లి హనుమంతరావుకు 114149 ఓట్లు రాగా, రామచంద్రరావుకు 40451 ఓట్లు వచ్చాయి. హనుమంతరావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. రామచంద్రరావు 2014లో కూడా బిజెపి తరపున పోటీచేసి ఓటమి చెందారు. అప్పుడు టిడిపితో పొత్తుతో పోటీచేయగా, ఈసారి ఒంటరిగా నిలబడిరది. 2014 ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ది కనకారెడ్డి విజయం సాధించారు. కనకారెడ్డికి 2768 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2009 నుంచి ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒక వెలమ, ఒక రెడ్డి, ఒక బిసి నేత(మున్నూరు కాపు) విజయం సాధించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..