marri rajasekhar reddy
-
‘హైడ్రా’ కూల్చివేతలు ఆపాలి.. హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరుతో హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రిట్ పిటిషన్ వేశారు. చినదామోర చెరువులోని బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలోని ఆక్రమణలను 7 రోజుల్లో తొలగించాలని నోటీసులు ఇచ్చారని.. హైడ్రా ఎటువంటి చట్టబద్దత లేని ఏజెన్సీ అని.. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడిన సంస్థ మాత్రమేనని మర్రి రాజశేఖర్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.ఉదయం 6 గంటల సమయంలో నిర్మాణాలను కూల్చివేయడం ఏమిటంటూ పిటిషనర్ ప్రశ్నించారు. "హైడ్రా" చర్యలు సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి విరుద్ధం అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విచారణ కొనసాగుతోంది.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, కాలేజీలను కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే.ఇక, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటితోపాటు దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందుకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. -
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి MLRIT కాలేజీకి రెవిన్యూశాఖ నోటీసులు
-
ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత
దుండిగల్: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్(ఐఏఆర్ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పనులను అడ్డగించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేయడంతో పాటు పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తరువాత మరో సారి కూల్చివేతలు కొనసాగించగా కళాశాల యాజమాన్యం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూల్చివేతలను నిలిపివేశారు. కళాశాలకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐఏఆర్ఈ కళాశాలలో కూల్చివేతలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే కళాశాల చైర్మన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కళాశాలకు వచ్చి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. 20 రోజుల్లోపే చర్యలు.. దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును ఫిబ్రవరి 20వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్వయంగా పరిశీలించారు. సుమారు 8.24 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారు లు అప్పట్లోనే ఆయనకు నివేదిక ఇచ్చారు. అదే నెల 22వ తేదీన ఎఫ్టీఎల్ సరిహద్దులను ఏర్పాటు చేసి షెడ్డులు, ఇతర నిర్మాణాలను తొలగించారు. తాజాగా ఐదు అంతస్తుల శాశ్వత భవనంలో రెండు అంతస్తుల మేర కొంత భాగాన్ని కూల్చారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నా...ఆగలేదు: మర్రి రాజశేఖర్‌రెడ్డి 25 సంవత్సరాల నుంచి కళాశాలను నడిపిస్తున్నాం. అప్పటి నుంచి ఏ ఒక్క అధికారి కూడా నోటీసు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అనుమతులు తీసుకున్నాం. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చిన తరువాత రెగ్యులరైజేషన్ చేసుకోవాలని సూచించడంతో 2015లోనే రెగ్యులరైజ్ కోసం రూ.90 లక్షలు చెల్లించాం. కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. ఇది మా పట్టా భూమి. మేము కొనుగోలు చేశాం. చిన్న చిన్న డీవియేషన్లు ఉంటే రెగ్యులరైజ్ చేసుకుంటాం. వారం క్రితం నోటీసు ఇచ్చారు.. కోర్టు ద్వారా సమాధానం ఇస్తామని చెప్పినా కనీసం సమయం కూడా ఇవ్వలేదు. -
పదేళ్లలో మేడ్చల్‌పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్‌పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్‌లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
కేటీఆర్ ను విమర్శించే స్థాయి మైనంపల్లికి లేదు: మర్రి రాజశేఖర్ రెడ్డి
-
మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ లో మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం
-
మల్కాజ్‌గిరిలో ఇవాళే బీఆర్ఎస్ బలప్రదర్శన
సాక్షి, మేడ్చల్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించినప్పటికీ.. కొడుక్కి సీటు దక్కలేదనే కారణంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళో, రేపే ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖరారు అయ్యింది కూడా. దీంతో.. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఇంఛార్జి అయిన మర్రి రాజశేఖర్‌రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపించారు. ఈయన మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి అల్లుడు కూడా. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి రాజశేఖర్‌రెడ్డి ఓడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనే అంశం ఆధారంగా టికెట్ కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ మేరకు నేడు బీఆర్ఎస్ భారీ బలప్రదర్శనకు సిద్ధమైంది. బుధవారం ఉదయం మల్కాజ్గిరి ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకూ సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం మీడియా సమావేశం ఉండనున్నట్లు తెలుస్తోంది. -
వీడిన సస్పెన్స్.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారంక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించుకుంటున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపిన కేటీఆర్, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీల నియామకం కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జీగా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీగా ఎంపీ మాలోతు కవితలను పార్టీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగనున్నారు. ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని, ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇంచార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందని, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్ధలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. ఏప్రిల్ 25వ తేదీన రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరగుతుందని, ఈ సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2500-3000 మంది ప్రతినిధులతో నిర్వహించుటామన్నారు. ఏప్రిల్ 27న తెలంగాణ భవన్లో వేడుకలు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీ రోజు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. 27న తెలంగాణ భవన్లో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సూమారు 300 మంది పార్టీ జనరల్ బాడీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఆరోజు ఉదయం కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పార్టీ జెండాను ఎగరవేసి ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ప్రారంభిస్తారని, ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు ఉండడం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ/ విస్తృత స్థాయి సమావేశం బదులు అక్టోబర్ 10వ తేదిన భారత రాష్ట్ర సమితి వరంగల్ మహాసభ నిర్వహణ జరుగుతుందన్నారు. మే నెలాఖరు వరకు ఆత్మీయ సమ్మేళనాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించుకుంటున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పట్ల కెసిఆర్ గారు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా, కూలంకషంగా మే నెలాఖరు దాకా కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని సూచించారు -
ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి అల్లుడు రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. టర్కీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. ఐటీ దాడులపై స్పందించారు. తమ ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. పథకం ప్రకారమే దాడులు చేశారన్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ -
ఐటీ అధికారులు చాలా అమానుషంగా సోదాలు చేశారు
-
వదంతులు నమ్మొద్దు
కంటోన్మెంట్: లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టాలని టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. అపోహలు సృష్టిస్తూ, అబద్ధాలను ప్రచారం చేసే ప్రత్యర్థుల మాటల నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. బోయిన్పల్లి సౌజన్యకాలనీలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి తనకు అపూర్వ స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా ఎక్కడికెళ్లినా కేసీఆర్ పథకాలతో సంతృప్తిగా ఉన్నామని ప్రజలు చెబుతూ ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగానూ ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రత్యర్థులకంటే 3.50 లక్షల పైచిలుకు మెజార్టీ సాధించారన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుండటంతో పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా నాలుగు లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులంతా టీఆర్ఎస్కు చెందిన వారే కావడం తనకు కలిసొస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు తన వ్యక్తిత్వంపై దాడికి యత్నించడం బాధాకరమన్నారు. తన కుటుంబ ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారని, 10వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారని అన్నారు. వారందరితో తాము కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి కాలేజీలో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ క్రమంలో తాను విద్యార్థులతో డ్యాన్స్ చేసే ఫొటోలను కొందరు సొషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఆయా విద్యార్థులు, వారి కుటుంబాలు బాధపడేలా చేయకూడదన్నారు. వదంతులు నమ్మొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
మీ కష్టాలకు కేంద్రమే కారణం
హైదరాబాద్: సారు.. కారు.. పదహారు.. మన మద్దతున్న వారిది ఢిల్లీలో సర్కారు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి మద్దతుగా కంటోన్మెంట్లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 16 మంది ఎంపీలు గెలిస్తే మన మద్దతున్న ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని, తద్వారా కంటోన్మెంట్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. జీహెచ్ఎంసీతో పోలిస్తే కంటోన్మెంట్ అభివృద్ధి వెనుకబడి పోయిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ప్యాట్నీ–హకీంపేట, ప్యారడైజ్–సుచిత్రా మార్గాల్లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. గత ఐదేళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలంటే గంట పాటు ధారాళంగా చెబుతామని, మోదీ ప్రభుత్వం మాత్రం తామేం చేశామో చెప్పుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. స్థానికుడిగా కంటోన్మెంట్ సమస్యలపై తన కు సంపూర్ణ అవగాహన ఉందని, ఎంపీగా గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సభ్యులతో కలిసి సమస్యలు పరిష్కరిస్తానని రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలు టీఆర్ఎస్కు కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేవని, వార్ వన్‌సైడ్‌గా కొనసాగుతోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
మల్కాజ్గిరి.. మామకు సవాల్ !
సాక్షి,సిటీబ్యూరో : ఎన్నో విశేషాలున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ విజయం ప్రధాన పార్టీలన్నింటికీ అతిముఖ్యం కావటంతో ఎవరికి వారే వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో వెళుతున్నారు. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు, యువ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయ కుడు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామ చంద్‌రావులు బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం టీఆర్ఎస్లో తీవ్ర పోటీ ఉన్నా.. రాజకీయ సమీకరణాల్లో మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఎంపిక చేసిన అధిష్టానం.. గెలుపు బాధ్యతను మాత్రం మంత్రి మల్లారెడ్డిపైనే మోపింది. మల్లారెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేసిన రెండు ఎన్నికల్లో అల్లుడు రాజశేఖర్‌రెడ్డి గెలుపు బాధ్యతను భుజాన వేసుకుంటే.. ఈ ఎన్నికలో మాత్రం అల్లుడి కోసం మామ అన్నీ తానై వ్యవహరించాల్సి వస్తోంది. నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మల్లారెడ్డి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశాలు పూర్తి చేశారు. మంగళవారం నుంచి నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. రాజశేఖర్‌రెడ్డి విజయం మంత్రి మల్లారెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం కావటంతో మామ సవాలుగా తీసుకుని ముందుకు వెళుతున్నారు. ఐదేళ్లలో ఎంతో తేడా.. 2014 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో ఇక్కడ విజయం సాధించిన టీడీపీ.. తాజా ఎన్నికలకు వచ్చేసరికి పోటీలోనే లేకుండా పోయింది. ఇక బీజేపీ, జనసేనలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎవరికి వారే పోటీకి దిగారు. గడిచిన ఎన్నికల్లో మాజీ ఐఏఎస్ అధికారి లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ, మా జీ డీజీపీ దినేష్‌రెడ్డిలు ఇక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదటిసారే లోక్‌సభకు.. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి తన తొలి ప్రయత్నంలోనే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఆపై టీఆర్ఎస్లో చేరిన మల్లారెడ్డి.. పదవికి రాజీనామా చేసి శాసనసభకు అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. తొలిసారే లోక్‌సభపై గురి రాజశేఖర్‌రెడ్డి రాజకీయాలకు కొత్త. మామ మల్లారెడ్డి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో తెర వెనక నుంచి అల్లుడు మంత్రాంగమంతా నడిపారు. మేడ్చల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో రాజశేఖర్‌రెడ్డికి విస్తృత సంబంధాలున్నాయి. తన గెలుపు బాధ్యతను మల్లారెడ్డితో పాటు బంధువులపై ఉంచి తాను ప్రజలతో మమేకం కానున్నారు. -
'జగన్ దీక్షకు జనమంతా అండగా నిలువాలి'
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే స్వయం సమృద్ది సాధిస్తుందని ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. వై ఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ప్రజలందరూ మద్దతుగా నిలువాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ నిరాహార దీక్ష వేదిక వద్దకు చేరుకున్న సందర్భంగా మర్రి రాజశేఖర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లో.. * ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, బీజేపీ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాయి. * ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేక ప్యాకేజీ గురించే మాట్లాడుతున్నాయి. * నవ్యాంధ్ర రాజధాని కోసం 35వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారు. 55వేల ఎకరాల అటవీ భూములను డీనోటీఫై చేసి తీసుకున్నారు. రాజధాని భూముల పేరిట రియల్ వ్యాపారం చేస్తున్నారు. * ప్రత్యేక హోదాను పట్టించుకోకుండా చంద్రబాబు తన స్వయంసమృద్ధినే చూసుకుంటున్నారు. * ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో జగన్, వైఎస్సార్సీపీ నేతలు గతంలో జాతీయస్థాయిలో పోరాడారు. ఢిల్లీలో ధర్నా చేశారు. * ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాటం ఆగదని మన నాయకుడు జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్షకు దిగారు. * దీక్షకు మద్దతుగా ఏపీ నలుములాల నుంచి ప్రజలు తరలివచ్చారు. -
'జగన్ దీక్షకు జనమంతా అండగా నిలువాలి'
-
'బాబు యాత్ర అంటేనే రైతులకు భయం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతు భరోసా యాత్ర అంటుంటే రైతులు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.95వేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఎద్దేవా చేశారు. మళ్లీ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు వచ్చాయని వాపోయారు. పట్టిసీమ మీద చూపే శ్రద్ధ పోలవరం మీద చూపితే రైతులు బాగుపడుతారని మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సూచించారు.