సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పేరుతో హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రిట్ పిటిషన్ వేశారు. చినదామోర చెరువులోని బఫర్ జోన్, ఎఫ్‌టిఎల్ పరిధిలోని ఆక్రమణలను 7 రోజుల్లో తొలగించాలని నోటీసులు ఇచ్చారని.. హైడ్రా ఎటువంటి చట్టబద్దత లేని ఏజెన్సీ అని.. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడిన సంస్థ మాత్రమేనని మర్రి రాజశేఖర్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఉదయం 6 గంటల సమయంలో నిర్మాణాలను కూల్చివేయడం ఏమిటంటూ పిటిషనర్ ప్రశ్నించారు. "హైడ్రా" చర్యలు సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి విరుద్ధం అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విచారణ కొనసాగుతోంది.
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, కాలేజీలను కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే.
ఇక, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటితోపాటు దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీ సహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. చిన్న దామెరచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందుకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment