Writ petition
-
భారత ప్రభుత్వంపై X దావా.. స్పందించిన కేంద్రం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్ ఎక్స్(X Plat Form) భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగింది. చట్టాలకు విరుద్ధంగా తమ కంటెంట్‌ను నియంత్రించాలని చూస్తోందని, ఏకపక్షంగా సెన్షార్‌షిఫ్‌నకు పాల్పడుతోందని.. ఇది యూజర్ల స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కోర్టుకెక్కింది. అయితే ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తుంది.. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తప్పనిసరిగా చట్టాన్ని గౌరవించాల్సిందే అని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం(Indian Government)పై కర్ణాటక హైకోర్టులో ఎక్స్(పూర్వపు ట్విట్టర్) రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణ జరుపుతోంది.ఐటీ యాక్ట్-2000 సెక్షన్ 79(3)(b) ప్రకారం.. కేంద్రం సేఫ్ హార్బర్ (Safe Harbor Provision) అనే నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లు తప్పనిసరిగా బ్లాక్ చేయడమో లేదంటే తొలగించడమో చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ న్యాయపరమైన రక్షణ కోల్పోతుంది. అయితే.. ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.భారతదేశంలో సరైన చట్టపరమైన విధానాలతో కాకుండా.. ఆన్లైన్లో కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని X ఆ రిట్ పిటిషన్లో ఆరోపించింది. కంటెంట్‌ను బ్లాక్ చేసే అంశంపై ఐటీ యాక్ట్‌లోని 69(A) సెక్షన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, అది ఏయే సందర్భాల్లో అనే అంశంపైనా శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు(2015లో)ను సైతం ఎక్స్ గుర్తు చేసింది. అయితే.. 69(A) సెక్షన్ కింద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు లేని సెక్షన్ 79(3)(b)తో కంటెంట్‌ను నియంత్రించాలని ప్రభుత్వం చూస్తోందని.. ఈ సెక్షన్ ద్వారా కంటెంట్ బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఎక్స్ అంటోంది. సాక్ష్యాలుగా 2024 ఫిబ్రవరిలో రైల్వే శాఖ పంపిన ‘బ్లాకింగ్ ఆదేశాలను’ కోర్టుకు చూపించింది. ఇది తమ వ్యాపార లావాదేవీలను దెబ్బ తీయడమే అవుతుందన్న ఎక్స్.. పైగా ఇలాంటి చర్యలు యూజర్ల స్వేచ్ఛను హరించడం అవుతుందని వాదించింది. అంతేకాదు.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నడిపించే సహయోగ్ పోర్ట్‌లో తమను చేరాలంటూ ప్రభుత్వం బలవంత పెడుతోందని ఆరోపించింది. అయితే.. తాము 2021 భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఐటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామన్న ఎక్స్.. ఇప్పటివరకైతే ప్రభుత్వం తమపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపింది. శ్రేయా సింఘాల్ కేసులో..సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
‘హైడ్రా’ కూల్చివేతలు ఆపాలి.. హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరుతో హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రిట్ పిటిషన్ వేశారు. చినదామోర చెరువులోని బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలోని ఆక్రమణలను 7 రోజుల్లో తొలగించాలని నోటీసులు ఇచ్చారని.. హైడ్రా ఎటువంటి చట్టబద్దత లేని ఏజెన్సీ అని.. కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడిన సంస్థ మాత్రమేనని మర్రి రాజశేఖర్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.ఉదయం 6 గంటల సమయంలో నిర్మాణాలను కూల్చివేయడం ఏమిటంటూ పిటిషనర్ ప్రశ్నించారు. "హైడ్రా" చర్యలు సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి విరుద్ధం అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విచారణ కొనసాగుతోంది.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, కాలేజీలను కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే.ఇక, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటితోపాటు దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందుకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. -
సర్వీసు వివాదాలనుఇతరులు సవాలు చేయలేరు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ సంస్థలో పనిచేయని, ఆ సంస్థ పరిపాలన వ్యవహారాలతో సంబంధంలేని ఏ వ్యక్తి అయినా కూడా ఆ సంస్థ కార్యకలాపాలను, అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ అధికరణ–226 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలా దాఖలు చేసే రిట్ పిటిషన్‌కు ఎంతమాత్రం విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఆ సంస్థ, ఆ అధికారి చర్యలపై అభ్యంతరాలుంటే వాటిని తగిన వేదికల ముందు సవాలు చేసుకోవచ్చునని సూచించింది. సర్వీసు వివాదాలను సాటి ఉద్యోగి మాత్రమే సవాలు చేయగలరని, సంబంధంలేని మూడో వ్యక్తి ప్రశ్నించజాలరని స్పష్టంచేసింది. వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీత ఆశ్రమం కార్యనిర్వహణాధికారి (ఈఓ) అయిన సి. శంకర బాలాజీని జిల్లా దేవాదాయ శాఖ ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎం. సురేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఇన్చార్జ్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడం తగదు.. ప్రొద్దుటూరుకు చెందిన సురేష్ శ్రీకృష్ణ గీత ఆశ్రమానికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని అందులో శారదా జూనియర్ కాలేజీ పేరుతో విద్యా సంస్థను నడుపుతున్నారు. ఆ ఆశ్రమానికి శంకర బాలాజీ ఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన్ను జిల్లా దేవాదాయశాఖ ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. దీనిని సవాలుచేస్తూ సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ మన్మథరావు విచారణ జరిపారు. శంకర బాలాజీ రెండు పోస్టుల్లో కొనసాగడానికి వీల్లేదని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. అసిస్టెంట్ కమిషనర్‌గా శంకర బాలాజీ నియామకం చట్ట విరుద్ధమన్నారు. ఆ నియామకం పిటిషనర్‌కు సంబంధంలేనిది.. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. శ్రీకృష్ణ గీత ఆశ్రమం, దేవదాయ శాఖ పరిపాలన వ్యవహారాల్లో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధంలేదన్నారు. శంకర్ బాలాజీని పూర్తిస్థాయి ఇన్చార్జ్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించడమన్నది పిటిషనర్‌కు సంబంధంలేని వ్యవహారమని తేల్చిచెప్పారు. అందువల్ల ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా శంకర్ బాలాజీ నియామకాన్ని ప్రశ్నించజాలరన్నారు. సురేష్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం కోర్టును విసిగించేదన్నారు. కాబట్టి.. సురేష్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సర్వీసు ఉద్యోగాల్లో సహ ఉద్యోగే బాధితుడుదేవదాయ శాఖ కమిషనర్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా బాలాజీ నియామకంవల్ల పిటిషనర్ ఏ విధంగా బాధితుడు కాదని, ఆయన నియామకాన్ని ప్రశ్నించేందుకు సహ ఉద్యోగి కూడా కాదన్నారు. సర్వీసు వివాదాల్లో సహ ఉద్యోగి మాత్రమే బాధిత వ్యక్తి అవుతారని కమిషనర్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ఆశ్రమం ఈఓ కౌంటర్ దాఖలు చేస్తూ కళాశాల నిర్వహిస్తున్న స్థలాన్ని ఎలాంటి వేలం నిర్వహించకుండా తనకే 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని పిటిషనర్ సురేష్ దేవదాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారన్నారు. చెల్లించాల్సిన లీజు బకాయిలను కూడా చెల్లించలేదని, బకాయిల కోసం పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. అద్దె కూడా సక్రమంగా చెల్లించకుండా కాలేజీ నిర్వహిస్తున్నారని, వీటన్నింటినీ ప్రశి్నస్తున్నందుకే శంకర బాలాజీ నియామకాన్ని సవాలుచేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. శంకర బాలాజీ సైతం ఇదే విషయాలతో వ్యక్తిగత హోదాలో కౌంటర్ దాఖలు చేశారు. -
నేడు కేసీఆర్ రిట్ పిటిషన్ పై తీర్పు
-
కేసీఆర్ రిట్ పిటిషన్ పై విచారణ
-
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్
సాక్షి, ఢిల్లీ: ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత రిట్ పిటిషన్లో కీలక అంశాలు ‘‘కవిత అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించారు. చట్ట పరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారు. కవిత అరెస్టు చట్టబద్ధం కాదు, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలి. ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలి’ కవిత తరఫు న్యాయవాదులు కోరారు. కాగా, మూడో రోజు కవిత ఈడీ కస్టోడియల్ ఇంటరాగేషన్ ముగిసింది. ఇండో స్పిరిట్‌లో 33 శాతం వాటా ఎలా వచ్చిందని ఈడీ ప్రశ్నించింది. 100 కోట్ల ముడుపులను ఎలా చెల్లించారు?. మొబైల్ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చిందంటూ ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అనంతరం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవితతో కేటీఆర్, అడ్వకేట్ మోహిత్ రావ్ ములాఖత్ అయ్యారు. -
ఆ 181 ఎకరాలు HMDAవే.. హైకోర్టులో భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ(HMDA)కు భారీ ఊరట లభించింది. శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్‌ఎండీఏవేనని హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆశ్రయించినట్లు గుర్తించిన కోర్టు.. వాళ్ల తీరును తప్పుబడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏకు చెందిన 181 ఎకరాల భూముల్లో.. 50 ఎకరాల భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ మేరకు కోర్టులో పత్రాలు సమర్పించి మరీ రిట్ పిటిషన్ వేశారు కొందరు. అయితే సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండీఏ ఆధీనంలోని భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారని హెచ్ఎండీఏ వాదించింది. ఇరువైపులా వాదనలు నవంబర్ 18వ తేదీన పూర్తికాగా.. తీర్పును రిజర్వ్ చేసింది డివిజన్ బెంచ్. ఈ క్రమంలో పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించిన ఉన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్.. ఇవాళ రిట్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. తీర్పు వెల్లడించే క్రమంలో అక్రమార్కుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, తమ ఉన్నతాధికారుల చొరవతో మొత్తానికి హెచ్ఎండీఏ కేసు గెలిచింది. -
ముఖ్యమంత్రి గురించి ఇష్టమొచ్చినట్లు రాస్తారా?
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన రాజధాని రైతులు అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్లు రాయడంపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డికి కులాన్ని ఆపాదించడాన్ని తప్పుపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. మీడియా దృష్టిని ఆకర్షించడానికే పిటిషనర్లు ఇలా చేస్తున్నారన్నారు. ఇలా ఏది పడితే అది రాసి పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, ఇలాంటి వ్యాజ్యాలను విచారించడానికి వీల్లేదని అన్నారు. వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలతో నిర్లక్ష్యపూరితంగా దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలకు విచారణార్హత లేదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందని వివరించారు. ఇలా చేయడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నందున, ఈ వ్యాజ్యం కూడా ఆ ధర్మాసనానికే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం స్పష్టంగా తెలిసి కూడా రిట్ పిటిషన్ దాఖలు చేయడం ‘ఫోరం షాపింగ్’ కిందకే వస్తుందని వివరించారు. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకోవాలని మిమ్మల్ని (జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లును) అడగటంటంలేదని, వ్యాజ్యం ధర్మాసనం ముందుకు మాత్రమే వెళ్లాలని చెబుతున్నామని చెప్పారు. ఒకవేళ విచారణ నుంచి మిమ్మల్ని తప్పుకోవాలని కోరితే (రెక్యూజ్) దాన్ని రాతపూర్వకంగానే కోరతామన్నారు. రాజధాని విషయంలో పిటిషనర్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలనే చూడాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే రిట్ పిటిషన్ వేశాం అంతకు ముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. తాము ఉద్దేశపూర్వకంగానే రిట్ పిటిషన్ వేశామన్నారు. ఈ వ్యవహారంలో తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ఆస్తి హక్కు ముడి పడి ఉన్నాయని, అందువల్లే పిల్ కాకుండా రిట్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. కార్యాలయాల తరలింపుపై గతంలో పిల్ దాఖలు చేసిన పిటిషనర్లు వేరని, వారికీ ప్రస్తుత వ్యాజ్యంలోని పిటిషనర్లకు సంబంధం లేదని తెలిపారు. రాజధాని విషయంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు అమల్లో ఉందని, దాని ప్రకారం కార్యాలయాలను రాజధాని నుంచి తరలించడానికి వీల్లేదన్నారు. ఆ తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 2283 జారీ చేసిందన్నారు. క్యాంప్ ఆఫీస్ అంటే టెంట్ (గుడారం)లో ఉండాలని, బంగళాల్లో ఉండకూడదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
ఇది కచ్చితంగా ఫోరం షాపింగే
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ ఐఏఎస్‌ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ని సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం వెనుక రాజధాని రైతుల దురుద్దేశాలను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టు ముందుంచారు. ఈ జీవోపై రిట్ పిటిషన్ దాఖలు చేయడం ఫోరం షాపింగ్ (కావాల్సిన న్యాయమూర్తి వద్దకు కేసు వచ్చేలా చేయడం) కిందకే వస్తుందని కోర్టుకు నివేదించారు. నీతి లేని వ్యక్తులే ఇలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తారని తెలిపారు. జీవో 2283ని రద్దు చేయాలని, అప్పటివరకు జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యంపై రిజిస్ట్రీ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా నంబరు కేటాయించడంపై శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జరుగుతోందంటూ ధర్మాసనం ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేసిన అమరాతి పరిరక్షణ సమితి, మరికొందరు.. ఇప్పుడు అదే అంశంపై రిట్ పిటిషన్ వేయడం ఆశ్చర్యకరమని ఏజీ అన్నారు. కార్యాలయాల తరలింపు వ్యవహారం రాజధాని అంశంతో ముడిపడి ఉందని, అలా తరలించడం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునకు విరుద్ధమని పిటిషనర్లు వారి వ్యాజ్యంలో స్వయంగా పేర్కొన్నారని, వారికి ఎలాంటి దురుద్దేశాలు లేకుంటే పిల్ దాఖలు చేసి ఉండే వారని తెలిపారు. పిల్ దాఖలు చేస్తే ఈ వ్యవహారం మొత్తం ధర్మాసనం ముందుకే వస్తుందని తెలిసి రిట్ దాఖలు చేశారన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో కూడా ఇలానే ఫోరం షాపింగ్‌కు పాల్పడ్డారని, దీంతో ధర్మాసనమే ఆ వ్యాజ్యాలను తెప్పించుకుని విచారణ జరిపిందన్నారు. రాజధాని వ్యవహారం కేవలం పిటిషనర్లకు మాత్రమే సంబంధించింది కాదని, పెద్ద సంఖ్యలో ప్రజలకు సంబంధించిందన్నారు. అందువల్ల పిల్ మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్యాలయాల తరలింపు విషయంలో అభ్యంతరాలుంటే తమ వద్దకు రావాలని పిటిషనర్లకు గతంలోనే ధర్మాసనం స్వేచ్ఛనిచ్చిందని, ఈ విషయం వారికీ తెలుసునన్నారు. అయినా ధర్మాసనం ముందుకు వెళ్లకుండా సింగిల్ జడ్జి వద్దకు వచ్చారని వివరించారు. చాలా తెలివిగా పిటిషన్‌ను తయారు చేశారని, అంతే తెలివిగా ధర్మాసనం ముందుకు రాకుండా చేశారన్నారు. వారి అంతిమ ఉద్దేశం ఫోరం షాపింగేనని చెప్పారు. ఫోరం షాపింగ్ విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన కోర్టు ముందుంచారు. అసలు ఈ పిటిషన్ విచారణార్హతపైనే ఏజీ అభ్యంతరాలు లేవనెత్తారు. దాదాపు గంటసేపు వాదనలు వినిపించిన ఏజీ.., తదుపరి వాదనలకు సమయం లేకపోవడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
చంద్రబాబు, అచ్చెన్నాయుడుకు ఉండవల్లి షాక్
-
అవినాశ్‌పై తొందరపాటు చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అన్ని విచారణ ఫైళ్లను, రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని సీబీఐ దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణ వివరాలను పెన్‌డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్‌లో పూర్తిగా సీల్డ్ కవర్లో సోమవారం కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. వివేకా హత్య జరిగిన చోట లభించిన లేఖ, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికను కూడా సమర్పించాలని సూచించింది. అప్పటి వరకు అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని దర్యాప్తు అధికారి (ఐవో)ని ఆదేశించింది. పిటిషనర్ (కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి) 14న ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు హాజరు కావాలని సూచించింది. ఆయన వెంట న్యాయవాది వెళ్లొచ్చని చెప్పింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై స్టే విధించాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ విచారణ చేపట్టినా.. అదంతా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీబీఐ తరఫున అనిల్ కొంపెల్లి వాదనలు వినిపించారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.. ‘వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం సీఆర్పీసీ 160 కింద జనవరి 24న హాజరు కావాలని ఒకరోజు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. 24న ఎంపీ విచారణకు హాజరయ్యారు. తన విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని, విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ జనవరి 27న దర్యాప్తు అధికారులకు అవినాశ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీన్ని దర్యాప్తు అధికారి అనుమతించలేదు. మళ్లీ ఫిబ్రవరి 24న హాజరు కావాలంటూ ఫిబ్రవరి 16న నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కూడా అవినాశ్‌రెడ్డి వీడియో, ఆడియో రికార్డింగ్‌పై విన్నవించారు. అప్పుడు కూడా అనుమతించలేదు. మరోసారి మార్చి 10న విచారణకు రావాలని మార్చి 5న సీఆర్పీసీ 160 కింద మరో నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణ పారదర్శకంగా సాగడం లేదని, నిష్పక్షపాతంగా సాగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ హైకోర్టు ను ఆశ్రయించారు’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. ‘వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ముందు పిటిషనర్ విచారణ ముగియగానే, మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు రాస్తూ, ఆయన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తోంది. వాస్తవాలను పట్టించుకోవడం లేదు. అందువల్లే వీడియో, ఆడియో రికార్డు చేయాలని దర్యాప్తు అధికారులను ఎంపీ కోరారు. అయినా దర్యాప్తు అధికారి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. విచారణ సమయంలో పిటిషనర్ చెబుతున్న అంశాలను టైపిస్ట్ టైప్ చేస్తుండగా, దర్యాప్తు అధికారి కంప్యూటర్ మౌస్‌ను పలుమార్లు తన చేతుల్లోకి తీసుకుని కొన్ని లైన్లు తీసివేయాలంటూ టైపిస్ట్‌కు సూచించారు. కంప్యూటర్ స్క్రీన్ దర్యాప్తు అధికారికి, టైపిస్ట్‌కు మాత్రమే కనిపించేలా ఉండటంతో ఏం డెలీట్ చేస్తున్నారో పిటిషనర్ చూడలేకపోయారు. అవినాశ్‌ను విచారణ చేసే సమయంలో నలుగురైదుగురు అధికారులు ఉన్నారు. విచారణ ముగిశాక దీనికి సంబంధించిన ఓ ప్రతిని ఇవ్వమని కోరినా, దర్యాప్తు అధికారి నిరాకరించారు. నిబంధనలు అంగీకరించవని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్ వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలివ్వాలి. ఎఫ్ఐఆర్ సహా ఎక్కడా అవినాశ్ పేరు లేదు. అయినా పలుమార్లు విచారణ పేరుతో వేధిస్తున్నారు. దర్యాప్తు అధికారి.. ముందే ఓ ఊహాజనిత స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని, ఆ మేరకు కావాల్సిన విధంగా సాక్షులను సిద్ధం చేస్తున్నారు. అవినాశ్‌రెడ్డితోపాటు భాస్కర్‌రెడ్డిని కూడా దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరిని వారికి అనుకూలంగా మలచుకుని, ఆ మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు’ అని వాదనలు వినిపించారు. వీడియో రికార్డింగ్‌తోనే విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్‌పై దర్యాప్తు అధికారి వివరణ తీసుకుని కోర్టుకు తెలియజేయాలని న్యాయమూర్తి.. సీబీఐ న్యాయవాదిని ఆదేశించారు. భోజన విరామం అనంతరం వాదనలు పునః ప్రారంభం కాగా, వీడియో, ఆడియో రికార్డింగ్‌లతోనే పిటిషనర్ విచారణ సాగుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను ఫోరెన్సిక్‌కు పంపినట్లు చెప్పారు. లేఖ విషయాన్ని 2021 జనవరి 31 నాటి అనుబంధ చార్జీషీట్లో పేర్కొన్నట్లు చెప్పారు. అవినాశ్‌రెడ్డి.. సాక్షినా? లేక నిందితుడా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అవినాశ్‌రెడ్డికి సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చామని.. అవసరమైతే ఆయన్ను, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది చెప్పారు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన సీబీఐ ఎస్పీ.. ఆడియో, వీడియో రికార్డుల హార్డ్‌డిస్క్, కేసు ఫైళ్లను ఇప్పుడే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సోమవారం సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్లో వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ అయ్యారు. పిటిషన్లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని కోరారు. వివేకా లేఖను తొక్కిపెట్టారు.. ‘వివేకా హత్య జరిగిన చోట దొరికిన లేఖను దర్యాప్తు అధికారులు తొక్కిపెడుతున్నా రు. వైఎస్ వివేకా అల్లుడే ఆయన్ను హత్య చేశాడని నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే ఈ కేసు అంశాలను మాత్రం సీబీఐ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. సీఆర్పీసీలో పేర్కొన్న నిబంధనల మేరకు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో పిటిషనర్ వీడియో, ఆడియో రికార్డు చేసేలా, న్యాయవాదిని విచారణ సమయంలో అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలి’ అని పిటిషనర్ న్యాయవాది నివేదించారు. -
తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు
-
విచారణ రికార్డ్ చేయాలని ఆదేశించండి: ఎంపీ అవినాశ్‌రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తాను సహకరిస్తున్నప్పటికీ విచారణ అధికారి సరైన విధానాలు అనుసరించడం లేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టును కోరారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘నన్ను మొదటిసారి విచారించినప్పటి నుంచి సీబీఐ అధికారులు అడిగినవి, అడగనివి కూడా చిలువలు పలువులు చేస్తూ దుష్ప్రచారం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా వేదికలు ప్రజల్లో అపోహలు కలిగించేలా అవాస్తవాలను వ్యాప్తిలోకి తీసుకొచ్చాయి. ప్రజల్లో అపోహలు తొలగించేందుకే సీబీఐ విచారణను రికార్డు చేయాలని విచారణ అధికారిని లిఖితపూర్వకంగా కోరాను. రెండోసారి విచారణకు పిలిచినప్పుడు కూడా రికార్డు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను, విచారణ అధికారి రామ్సింగ్ను లిఖితపూర్వకంగా కోరాను. అయినా పట్టించుకోలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’ అని పిటిషన్లో పేర్కొన్నారు. నేడు విచారణ అవినాశ్ రెడ్డి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేసులు విచారించే బెంచ్‌కు పంపారు. ఈ పిటిషన్‌ను జస్టిస్. కె.లక్ష్మణ్ బెంచ్ శుక్రవారం విచారించనుంది. చదవండి: జగనన్న విద్యా కానుకపై ‘ఈనాడు’ ఏడుపు -
గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమిళిసై సౌందరరాజన్ 10 బిల్లులను ఆపడంతో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆమె వ్యవహరశైలిపై సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశించాలని చీఫ్ సెక్రెటరీ పటిషన్లో కోరారు. ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఇది సుప్రీంకోర్టులో రేపు( శుక్రవారం) విచారణకు వచ్చే అవకాశముంది. 'గవర్నర్ బిల్లులను ఆపడం రాజ్యాంగ విరుద్ధం. ఆలస్యం అవ్వడం వల్ల బిల్లుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. పది బిల్లులుపై ఆమోదమ ? కాదా ? చెప్పడం లేదు. సహేతుక కారణాలు లేకుండా పెండింగ్ సరికాదు. సంబంధిత మంత్రులు గవర్నర్‌ను కలిసి వివరణలు కూడా ఇచ్చారు. త్వరలోనే ఆమోదిస్తామని గవర్నర్ చెప్పినా ఆచరణలో లేదు. ఆర్టికల్ 163 ప్రకారం మంత్రిమండలి సలహా మేరకే విధులు నిర్వర్తించాలి. స్వతంత్రంగా వ్యవహరించాలని భావించరాదు.' అని తెలంగాణ సీఎస్ పటిషన్లో పేర్కొన్నారు. నాటి రాజ్యాంగ సభ డిబేట్లను కూడా ప్రస్తావించారు. కాగా.. హైకోర్టు జోక్యంతో బడ్జెట్ -గవర్నర్ ప్రసంగం ఇష్యూ సమసి పోయిన విషయం తెలిసిందే. చదవండి: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ కోమటిరెడ్డి దీక్ష -
సుప్రీంలో ఊరట.. జడ్జిగా గౌరీ ప్రమాణం
సాక్షి, ఢిల్లీ: మద్రాస్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా లాయర్ లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలీజియంలో చర్చ జరిగాకే ఆమె పేరు ప్రతిపాదించినట్టు పేర్కొంది. సంబంధిత హైకోర్టు జడ్జిల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు తేలినా లేదా ప్రమాణానికి లోబడి విధులను నిర్వర్తించకున్నా రెండేళ్ల తర్వాత ఆమె పనితీరు సంతృప్తికరమని భావిస్తేనే శాశ్వత జడ్జిగా ప్రతిపాదించే అవకాశం కొలీజియంకు ఉందని గుర్తు చేసింది. గతంలో అడిషనల్ జడ్జిలుగా పనిచేసిన వారు శాశ్వత జడ్జీలు కాలేకపోయిన ఘటనలు అనేకం ఉన్నాయంది. ఒక వ్యక్తి రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలు ఆ వ్యక్తి పేరును జడ్జిగా సిఫారసు చేయకపోవడానికి కారణం కాదని కొలీజియం భావించిందని పేర్కొంది. గౌరి మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ కొందరు లాయర్లు కేసు వేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే... మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుకు ముందే మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా గౌరి ప్రమాణం చేశారు! తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజా మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఆమెతో ప్రమాణం చేయించారు. తనకు గొప్ప అవకాశమిచి్చన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1973లో జని్మంచిన గౌరి, 1995లో లాయర్‌గా పేరు నమోదు చేయించుకున్నారు. మదురై బెంచ్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా 2022 నుంచి పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం జనవరి 17వ తేదీన గౌరితో కలిపి మొత్తం ఐదు పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసు చేసింది. -
మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం..
న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియమిస్తూ కేంద్రం నోటిఫై చేయడంపై వివాదం చెలరేగింది. ఆమెను జడ్జిగా సిఫారసు చేసిన కొలీజియం నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముస్లింలు, క్రైస్తువులపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మొదట వచ్చేవారం విచారణ చేపడతామన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఆ తర్వాత ఈ పిటిషన్‌పై ఈనెల 10న(శుక్రవారం) విచారణ జరుపుతామని చెప్పారు. విక్టోరియా గౌరికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించడాన్ని కొంతమంది మద్రాస్ హైకోర్టు లాయర్లు ఇప్పటికే వ్యతిరేకించారు. ఆమెను జడ్జిగా నియమించవద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు కొలీజియాన్ని కోరారు. ఈమె జడ్జి అయితే ముస్లింలు, క్రైస్తవులకు తమకు న్యాయం దక్కుతుంది అనే నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్రానికి మధ్య మాటల యుద్ధం జరిగిన సమయంలో విక్టోరియా గౌరి పదోన్నతి సాఫీగా జరిగిపోయిందని పలువురు విమర్శలు గుప్పించారు. చదవండి: ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు -
హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కామారెడ్డి రైతులు
-
KA Paul: పిల్ కాకుండా రిట్ ఏంటండి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్‌షోలు, బహిరంగ సభలపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో కాకుండా రిట్ పిటిషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపింది. దీనిపై.. తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి ముందుంచింది. రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యం గురువారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు వద్దకు వచ్చింది. ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం కదా. అలాంటప్పుడు ఈ వ్యాజ్యాన్ని పిల్ రూపంలో దాఖలు చేయాలి కదా! అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయినా పిటిషనర్ గతంలో తన క్లయింట్ అయినందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించలేనని స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చేలా రిజిస్ట్రీకి ఆదేశాలివ్వాలని పాల్ న్యాయవాది ఎంవీ రాజారాం కోరగా.. ఆ పని తాను చేయలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అత్యవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో మరో మలుపు తిరిగింది. బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన మరో బెంచ్ ఈ మేరకు కీలక తీర్పును వెల్లడించింది. రిట్ పిటిషన్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతివాదులుగా ఉన్న ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల(నవంబర్) 4వ తేదీ వరకు గడువు విధిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు కేసులో విచారణ వాయిదా వేయాలని పోలీసులను ఆదేశిస్తూ.. దర్యాప్తుపై స్టే విధించింది. అయితే అంతకుముందు హైకోర్టులో పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ఆధారంగా.. రిమాండ్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని.. లొంగిపోకపోతే వారిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలని, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించాలని సైబరాబాద్ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏసీబీ కోర్టుకు వీళ్లను తరలించినట్లు తెలుస్తోంది. రెండు ధర్మాసనాలు వేర్వేరు తీర్పులివ్వడం.. ఒక బెంచ్ రిమాండ్‌కు తీసుకోవాలని ఆదేశిస్తే.. మరో బెంచ్ విచారణ వాయిదా వేయాలని ఆదేశించడం.. ఈలోపే సైబరాబాద్ పోలీసుల దూకుడుతో ఏం జరగనుందో అనే ఆసక్తి నెలకొంది. -
పీఆర్సీపై పిటిషన్.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు
Latest Updates: పీఆర్సీపై దాఖలైన పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, అదే సమయంలో విభజన చట్టానికి సంబంధించిన పిటిషన్ కూడా కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత సర్వీస్‌కు సంబంధించిన మేటర్ కాబట్టి ఈ కోర్టులో విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను వేరొకరికి రిఫర్ చేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ భానుమతి తెలిపారు. హైకోర్టులో మళ్లీ ప్రారంభమైన వాదనలు పీఆర్సీ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మధ్యాహ్నం 2:15కి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికి రూ.28 వేల జీతం పెరిగిందన్నారు. ప్రభుత్వంపై రూ.10,860 కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు. 2018లో ఉద్యోగుల జీతాల కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు ఆ ఖర్చు రూ.68 వేల కోట్లకు చేరిందన్నారు. ఉద్యోగులకు ఇవ్వకూడదన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, పునర్విభజన చట్టంలో హెచ్ఆర్ఏ ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని పేర్కొనలేదని పేర్కొన్నారు. పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పండని పిటిషన్ దారులను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని, అయినా పీఆర్సీని సవాల్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అంతకుముందు కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. విభజన చట్టం ప్రకారం పీఆర్సీ ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ ఇవ్వలేదని అన్నారు. ఇక ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పీఆర్సీపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా బెదిస్తారని వాదించారు. సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా కోర్టులో రిట్ పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఏజీ కోర్టుకు దృష్టికి తెచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని, అయితే, చర్చలను రాబోమని చెప్తున్నారని కోర్టుకు తెలిపారు. (చదవండి: ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోంది.. మేమేం చేయలేం’ ) -
హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల పథకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిట్ అప్పీల్ విచారణపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కోసం న్యాయమూర్తులు పంపారు. ఈనెల 20న ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. -
‘పేదలందరికీ ఇళ్ల నిర్మాణం’పై ప్రభుత్వం అప్పీల్
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ మంగళవారం విచారణకు రానుంది. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించనుంది. రిట్ పిటిషన్లో సింగిల్ జడ్జిగా జస్టిస్ సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు కాబట్టి తన తీర్పుపై తానే విచారణ జరిపే అవకాశం ఉండదు. అందువల్ల ఆయన ఈ అప్పీల్‌ను మరో ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉంది. ప్రభుత్వ అప్పీల్ విచారణ కోసం ప్రస్తుతం వెకేషన్ జడ్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ రఘునందన్‌రావులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒకవేళ జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అప్పీల్‌పై విచారణ అంత అత్యవసరం కాదని భావిస్తే విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసే అవకాశం ఉంది. 30 లక్షల మంది లబ్ధిదారుల ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాన్ని హైకోర్టు అత్యవసరం కాదని భావిస్తుందా? అనేదానిపై మంగళవారం స్పష్టత రానుంది. వాస్తవానికి ప్రభుత్వం.. తీర్పు వచ్చిన మరుసటి రోజే అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపేందుకు సీజే అరూప్‌కుమార్ గోస్వామి సానుకూలంగా స్పందించారు. అయితే ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వ అప్పీల్‌ను పక్కన పెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. సోమవారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ జరపాల్సిన అత్యవసరాన్ని, ఆవశ్యకతను ప్రభుత్వం అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ద్వారా రిజిస్ట్రీకి వివరించింది. -
భారత్ యాక్షన్.. గూగుల్ కౌంటర్ రియాక్షన్
యాప్ మార్కెట్లో భారత్ నుంచి ఎదురైన ప్రతికూలతపై గూగుల్ కౌంటర్ రియాక్షన్ ఇచ్చింది. తమకి వ్యతిరేకంగా ఆరోపణలతో కూడిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నివేదిక బయటకు రావడంపై గూగుల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు ముందు ముందు తమ హక్కులకు భంగం వాటిల్లకుండా పరిరక్షించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యాప్ మార్కెటింగ్‌లో ఇతరులకు స్థానం ఇవ్వకపోవడం, డివైజ్ తయారీదారులపై ఒత్తిడి లాంటి అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్(ADIF) ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీసీఐ రెండేళ్లుగా దర్యాప్తు నిర్వహించింది. ఈ మేరకు సీసీఐ దర్యాప్తు విభాగం ‘ డైరెక్టర్ జనరల్’ గూగుల్‌పై వెల్లువెత్తిన ఆరోపణల్ని నిర్ధారించింది కూడా. అయితే అక్కడితో ఆగకుండా ‘గూగుల్ ఆండ్రాయిడ్ వ్యవహారాల్లో అనైతికంగా ప్రవర్తించిందని, వ్యాపార సూత్రాల్ని విస్మరించింద’ని పేర్కొంటూ పలు అంశాలతో కూడిన నివేదికను లీక్ చేసింది. దీంతో గూగుల్ ఘాటుగా ప్రతిస్పందించింది. అయితే తమకు వ్యతిరేకంగా సీసీఐ దర్యాప్తు విభాగం ‘డీజీ’ వ్యవహరించడంపై గూగుల్ రంగంలోకి దిగింది. గురువారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గోప్యంగా ఉంచాల్సిన నివేదికను బయటపెట్టడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మీదట దర్యాప్తునకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాకుండా సీసీఐ దర్యాప్తు విభాగాన్ని నిలువరించాలని హైకోర్టును అభ్యర్థించింది గూగుల్. ప్రభుత్వ విభాగాల గోప్యపు నివేదికలు బయటపెట్టడం.. అవతలి వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని భంగపరచడమే అవుతుందని గూగుల్ వాదిస్తోంది. మరోవైపు డీజీ దర్యాప్తులోని అంశాలు కేవలం ఆరోపణలేనని, అవి తుదితీర్పుపై ప్రభావం చూపించకపోవచ్చనే గూగుల్ చెబుతోంది. నివేదికగానీ, నోటీసులుగానీ తమదాకా రాలేదని, అందుకే ఈ అంశంపై సమీక్ష దిశగా కూడా ఆలోచన చేయట్లేదని పేర్కొంది. డివైజ్ తయారీదారుల సామర్థ్యం తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ వెర్షన్లను(ఫోర్క్స్) బలవంతంగా వాళ్లపై రుద్దిందనేది సీసీఐ(డీజీ విభాగం) తన దర్యాప్తులో గుర్తించింది. తాజాగా అనధికారికంగా ఒక నివేదికను విడుదల చేసిన సీసీఐ.. గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: భారత్‌లోనూ యాపిల్‌కు చేదు అనుభవం! -
ఎమ్మెల్సీ నియామకాలపై రిట్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గోరేటి వెంకన్న, సారయ్యా, దయానందల నియామకాలను చాలెంజ్ చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకం చేపట్టారని తన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వర్గం ఎమ్మెల్సీ సిఫార్సులను ఆమోదించడంపై ఆయన హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరును రెండుసార్లు గవర్నర్‌కు ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రానున్న నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. -
డ్రోన్లు ఎగరేయలేదు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్ట వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్, ఇతర ప్రముఖుల నివాసాలపై డ్రోన్ కెమెరాలను ఎగరేశామని తనను అరెస్టు చేసిన పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి డ్రోన్లు ఎగరేయలేదని పేర్కొన్నారు. అయినా ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్‌కు తరలించకూడదని అర్వేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మాదాపూర్ ఏసీపీ ఎన్.శ్యాం ప్రసాద్‌రావు, మాదాపూర్ ఎస్‌హెచ్‌వో ఎం.గంగాధర్ ఉల్లంఘించారని రిట్లో పేర్కొన్నారు. వీరిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. తొలుత తనపై ఐపీసీ సెక్షన్–188 కింద కేసు పెట్టిన పోలీసులు.. తర్వాత పలు సెక్షన్లు చేర్చారని తెలిపారు. ఐపీసీ 287, 115, 109, 120(బీ), 201 సెక్షన్లు, ఎయిర్ క్రాఫ్ట్ చట్టంలోని సెక్షన్ 11(ఏ) రెడ్‌విత్ 5(ఏ) కింద కేసు పెట్టారని వివరించారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే ఏడేళ్లలోపే శిక్ష పడుతుందని, అయినా తనను కావాలని పోలీసులు రిమాండ్‌కు తరలించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సీఆర్పీసీలోని సెక్షన్–41 కింద తనకు ముందుగా నోటీసు ఇవ్వాలన్న నిబంధనను సైతం పోలీసులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు ఈ ఏడాది మార్చి 1న రాత్రి 9 గంటలకు రామచంద్రపురం పీఎస్‌లో నిర్బంధించారని, మళ్లీ రావాలని చెప్పి విడిచిపెట్టారని తెలిపారు. తానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు సంబంధం లేదని చెప్పినా వినకుండా, పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని తెలిసినా అరెస్ట్ చేశారన్నారు. ఈ రిట్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
ఢిల్లీకి చేరిన ‘మహా’ పంచాయితీ
న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీని చేరాయి. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. అక్టోబర్ 24న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ-శివసేన దోస్తీ తెగదెంపులు కావడంతో.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో వారికి ఊహించని షాక్ తగిలింది. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. (చదవండి : శివసేన, ఎన్సీపీలతో కలిసే ఉన్నాం: కాంగ్రెస్) శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ వారితో ప్రమాణం చేయించారు. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ముంబై వర్గాల సమాచారం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది. (చదవండి : ఫడ్నవిస్‌కు బలముందా.. ఉత్కంఠగా బలపరీక్ష!) -
చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...
సాక్షి, బళ్లారి: పేదరికంలో మగ్గుతున్న ఓ విద్యార్థి తనకు కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు. హక్కుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మంజునాథ్ ఓ రోజు పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తాను ధరించిన చొక్కా అపరిశుభ్రంగా ఉంది. మరో చొక్కా వేసుకుందామంటే అదీ చిరిగిపోయింది. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉండగా.. ఒక జత మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దీంతో మంజునాథ్ యూనిఫామ్ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించకూడదని తండ్రిని అడిగాడు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించవచ్చని.. కోర్టుకు సైతం వెళ్లవచ్చని తండ్రి దేవరాజ్ చెప్పాడు. కుమారుడిని హైకోర్టు న్యాయవాది అజిత్ వద్దకు తీసుకెళ్లి విషయం తెలిపాడు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చని న్యాయవాది సలహా ఇవ్వడంతో విద్యార్థి మంజునాథ్ ఈ ఏడాది మార్చి 25న రిట్ వేశాడు. విచారణకు స్వీకరించిన హైకోర్టు ›ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ మహమ్మద్ నవాజ్‌తో కూడిన డివిజన్ బెంచ్ సుదీర్ఘంగా విచారించి గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆర్టీఈ (రైట్ టు ఎడ్యుకేషన్) యాక్ట్ ప్రకారం రెండు నెలల్లోపు యూనిఫామ్‌తోపాటు షూ, సాక్సులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కేసు వేసిన విద్యార్థికి రెండు వారాల్లోపు రెండు జతల యూనిఫామ్, షూ, సాక్సులు ఇవ్వాలని కోర్టు ప్రత్యేకంగా సూచించింది. కోర్టు తీర్పు అనంతరం బాలుడు మంజునాథ్ మాట్లాడుతూ తన అర్జీపై హైకోర్టు స్పందించి ఆదేశాలు ఇవ్వడం సంతోషం కలిగించిందన్నాడు. తన పోరాటానికి తండ్రి దేవరాజ్ సహకారం ఇవ్వడం వల్లే విజయం సాధించానని చెప్పాడు. -
హత్యాయత్నంలో కుట్ర ఉంది..
-
వైఎస్ జగన్ రిట్ పిటిషన్ విచారణ వాయిదా
-
రాష్ట్రపతికి కొణతాల లేఖ
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 ప్రకారం ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు అందించే నిధులను వెనక్కి తీసుకుని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 46(2), 46(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికై 2017- 18 సంవత్సరానికి గానూ 350 కోట్ల రూపాయలు విడుదల చేశారని... కానీ పలు రాజకీయ కారణాల వల్ల ఆ నిధులను వెనక్కి తీసుకోవడం దారుణమని కొణతాల లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వచ్చే మూడేళ్లలో 1050 కోట్ల నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా ఏపీ వినియోగించుకున్న 946.47 కోట్ల రూపాయలకు సంబంధించిన సర్టిఫికెట్లు ప్రభుత్వం సమర్పించిందని లేఖలో పేర్కొన్నారు. అదే తరహాలో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 350 కోట్ల రూపాయలు ఏపీకి విడుదల చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారని.. కానీ ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలపలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏదో భిక్ష వేస్తున్నట్లు కేంద్రం ప్రవర్తిస్తోందని.. కానీ ఆ నిధులు పొందడం చట్టబద్ధమైన హక్కు అని.. ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాలని రాష్ట్రపతికి విఙ్ఞప్తి చేశారు. కేబీకే(కోరాపూట్- బోలంగిర్- కలహంది) ప్లాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ మాదిరి అభివృద్ధికై ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని కొణతాల తెలిపారు. ఏపీకి నిధులు విడుదల చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చడం లేదోమోనని.. అందుకే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నారు. నిధులు వెనక్కి తీసుకోవడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, అందుకు సంబంధించిన ప్రతిని ఈ లేఖతో జత చేస్తున్నామని కొణతాల పేర్కొన్నారు. -
నంద్యాల ఎన్నికపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలైంది. కిరణ్‌బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రలోభానికి గుర్తిచేస్తోందని తెలిపారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, అధికార టీడీపీ నాయకులపై ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం నాయకుల ప్రలోభాల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. టీడీపీ నేతల అక్రమాలపై ఈసీ సీరియస్‌గా దృష్టి సారించింది. -
హెచ్‌సీఏపై మరో రిట్ దాఖలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై మరో రిట్ పిటిషన్ దాఖలు అయింది. హెచ్‌సీఏ ఎన్నికల వివాదంపై కోర్టులో విచారణ జరుగుతుండగానే వచ్చే నెల 9వ తేదీ నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లకు తాత్కాలిక అధికారిని నియమించాలంటూ మరో పిటిషన్ దాఖలయింది. లోథా కమిటీ ఆదేశాల ప్రకారం హెచ్‌సీఏ పనిచేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా, విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై మరో రిట్ పిటిషన్
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం మరో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దాఖలైన క్రిమినల్ కేసులో ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వ ట్యాప్ చేసిందని ఆరోపిస్తూ సత్యనారాయణపురం పీఎస్‌లో కేసు దాఖలైన విషయం తెలిసిందే. -
యూపీఎస్సీపై రిట్‌కు తిరస్కృతి
ఇంగ్లిష్ పరీక్షపై నిర్ణయాన్ని వ్యతిరేకించిన పిటిషనర్ న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగంలోని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయవలసిన అవసరంలేదని యూపీఎస్సీ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంపై రిట్‌పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు తగిన వేదిక కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇంగ్లీష్ ప్రశ్నలు వదిలేయండి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో మార్పులకు సంబంధించి కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. సీశాట్-2గా పిలిచే ప్రిలిమ్స్ రెండో పేపర్లో ఇంగ్లీష్ భాషకు సంబంధించిన కాంప్రహెన్షన్ స్కిల్స్ విభాగంలో అభ్యర్థులకు వచ్చే మార్కులను గ్రేడింగ్‌లో పరిగణించబోమని అందులో స్పష్టం చేసింది. పేపర్-1(సీశాట్-1)లో 200 మార్కులకు గాను సాధించే మార్కులు, పేపర్-2లో ఇంగ్లీష్ విభాగం మార్కులు తీసేయగా వచ్చే మార్కులను కలిపి మెరిట్‌ను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. అందువల్ల ఆంగ్ల భాషా నైపుణ్యానికి సంబంధించిన 9 ప్రశ్నలకు(22.5 మార్కులు) సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాటిని వదిలిపెట్టవచ్చని అభ్యర్థులకు సూచించింది. ఈ నెల 24న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. సీశాట్-2లో ప్రశ్నల సరళిపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.