తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో వాదనలు విన్న ధర్మాసంన తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో మంగళవారం కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ పోలీసుల విచారణ తీరుపై ఉన్న అనుమానాలను హైకోర్టు అడిగి తెలుసుకుంది. వైఎస్ జగన్ తరపున ప్రముఖ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు