హెచ్‌సీఏపై మరో రిట్ దాఖలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై మరో రిట్ పిటిషన్ దాఖలు అయింది. హెచ్‌సీఏ ఎన్నికల వివాదంపై కోర్టులో విచారణ జరుగుతుండగానే వచ్చే నెల 9వ తేదీ నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లకు తాత్కాలిక అధికారిని నియమించాలంటూ మరో పిటిషన్ దాఖలయింది. లోథా కమిటీ ఆదేశాల ప్రకారం హెచ్‌సీఏ పనిచేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా, విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు.