సాక్షి, ఢిల్లీ: ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కవిత రిట్ పిటిషన్‌లో కీలక అంశాలు
‘‘కవిత అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించారు. చట్ట పరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారు. కవిత అరెస్టు చట్టబద్ధం కాదు, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలి. ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలి’ కవిత తరఫు న్యాయవాదులు కోరారు.
కాగా, మూడో రోజు కవిత ఈడీ కస్టోడియల్ ఇంటరాగేషన్ ముగిసింది. ఇండో స్పిరిట్లో 33 శాతం వాటా ఎలా వచ్చిందని ఈడీ ప్రశ్నించింది. 100 కోట్ల ముడుపులను ఎలా చెల్లించారు?. మొబైల్ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చిందంటూ ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అనంతరం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవితతో కేటీఆర్, అడ్వకేట్ మోహిత్ రావ్ ములాఖత్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment