
నంద్యాల ఎన్నికపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలైంది. కిరణ్‌బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రలోభానికి గుర్తిచేస్తోందని తెలిపారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, అధికార టీడీపీ నాయకులపై ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం నాయకుల ప్రలోభాల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. టీడీపీ నేతల అక్రమాలపై ఈసీ సీరియస్‌గా దృష్టి సారించింది.