
'బాబు యాత్ర అంటేనే రైతులకు భయం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతు భరోసా యాత్ర అంటుంటే రైతులు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.95వేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఎద్దేవా చేశారు. మళ్లీ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు వచ్చాయని వాపోయారు. పట్టిసీమ మీద చూపే శ్రద్ధ పోలవరం మీద చూపితే రైతులు బాగుపడుతారని మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సూచించారు.