
టీఆర్‌ఎస్ నేత మైనంపల్లి హన్మంత రావు
హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంత రావు మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రతిపక్షాన్ని తిట్టిన తిట్టుకుండా తిట్టి, తిరిగి అదే పార్టీలో కలిసిన రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మరోసారి మాట్లాడితే తెలంగానలో తిరగలేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆంధ్రాలోనూ టీడీపీ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌లు పొత్తులు పెట్టుకున్నా టీఆర్‌ఎస్‌ను ఓడించలేరని అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment