ఎస్టీపీ ప్లాంట్ వద్ద ప్లాన్ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మైనంపల్లి
మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గంలోని ముఖ్యమైన చెరువుల వద్ద సుమారు రూ.70 కోట్లతో ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. సఫిల్‌గూడలోని ఎస్టీపీతో పాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న బండ చెరువు ప్రాంతాలను శనివారం ఆయన జలమండలి, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
సఫిల్‌గూడ లోని 0.5 ఎంఎల్‌డీ ప్లాంట్ సామర్థ్యాన్ని సుమారు రూ.12.45 కోట్లతో 5.5 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్టీపీగా మార్చుతున్నామన్నారు. బండచెరువు వద్ద సుమారు 28.15 కోట్లతో 15 ఎంఎల్‌డీ ఎస్టీపీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు కోసం పిల్లి నర్సింగరావు కాలనీలో సుమారు మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామన్నారు. ఆల్వాల్ కొత్త చెరువు వద్ద సుమారు రూ.28.90 కోట్లతో 15.5 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు, నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎమ్మెల్యే వెంట జలమండలి ప్రాజెక్ట్ అధికారి నరేందర్‌కుమార్, జీఎం సునీల్‌కుమార్, డీజీఎంలు స్రవంతి రెడ్డి, భాస్కర్, జీహెచ్‌ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ డీసీ జి.రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేష్, తహసీల్దార్ వినయలత, ఉన్నారు.
చెరువుల ప్రక్షాళనకు చర్యలు..
అల్వాల్: అల్వాల్‌లో చెరువుల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఆయన అధికారులు, కార్పొరేటర్లతో కలిసి అల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు. భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతున్న అల్వాల్‌లోని మోత్కుల కుంట చెరువు, కొత్త చెరువు, చిన్నరాయుడి చెరువులలో మురుగు నీరు కలుస్తుండటంతో నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.
చెరువులలోకి వరదనీటిని మళ్లించడంతో పాటు వ్యర్థాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామని ఇందుకోసం రూ.1 50 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, ప్రేంకుమార్, డీసీ నాగమణి, అధికారులు నాగేందర్, నిర్మల, పవన్‌కుమార్, ఈఈ రాజు, డీఈలు మహేష్ , ప్రశాంతి, ఏఈ, లక్ష్మీ, జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ ఉన్నారు.
ప్రణాళికాబద్ధంగా వసతుల కల్పన
అల్వాల్: వెంకటాపురం డివిజన్‌లో అన్ని కాలనీల్లో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రూ.1.03 కోట్ల వ్యయంతో భూదేవినగర్, సుభాష్‌నగర్, ఇందిరానగర్‌లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన కార్పొరేటర్ సబితాకిషోర్‌తో కలిసి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment