STP
-
డైరెక్ట్ ప్లాన్లలో ఎస్‌డబ్ల్యూపీ, ఎస్టీపీ ఎలా..?
డైరెక్ట్ ప్లాన్లలో నేను ఇన్వెస్ట్ చేస్తే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసుకునే సేవలను ఫండ్ సంస్థ అందిస్తుందా? – విజయ్ కుమామ్ డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు స్వయంగా నిర్వహించుకునేవి. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ఇన్వెస్టర్ రెండు మూడు మార్గాల్లో నిర్వహించుకోవచ్చు. సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా బ్రిక్స్ అండ్ మోర్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి చేసుకోవాలి. అంటే ఫండ్ హౌస్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అయిన కేఫిన్‌టెక్, క్యామ్స్ ద్వారా ఈ లావాదేవీలు చేసుకోవచ్చు. సమీపంలోని ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్‌కు స్వయంగా వెళ్లి సిప్ లేదా ఎస్‌డబ్ల్యూపీ లేదా ఎస్టీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ హౌస్ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్‌లు సైతం డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సదుపాయాల ద్వారా ఇన్వెస్టర్లు సొంతంగా ఈ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండ్ హౌస్ సంస్థ నేరుగా సాయం అందించదు. నేను కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్ అనే ప్లాట్‌ఫామ్‌ను ఇందుకోసం వినియోగిస్తున్నాను. ఇది ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్స్‌లో లావాదేవీలను ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ తెలిసిన అందరికీ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణ సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే మొదట కేవైసీ, ఇతర అవసరాలను ఇచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. వీటిని సైతం ఇంటి నుంచే చేసుకునే సౌలభ్యం ఉంది. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి సేవలను ఇన్వెస్టర్లు సులభంగా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. నేను ఎన్పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్ గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో అస్థిరతలు.. షార్ట్ డ్యూరేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌తో పోలిస్తే సహజంగా ఎక్కువే. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్‌కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో యాక్టివ్‌గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. కనుక మీ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించుకోవచ్చు. -
ఆస్పత్రుల్లో మురుగుశుద్ధి కేంద్రాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో జీవ వైద్యవ్యర్థాల నిర్వహణలో భాగంగా వ్యర్థజలాలను శుద్ధి చేయడానికి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, టిమ్స్ సహా రాష్ట్రవ్యాప్తంగా 20 ఆస్పత్రుల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం రూ.68.31 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు. ఆస్పత్రుల్లోని ద్రవవ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సి ఉందని, లేనట్లయితే పరిసరాలు, సమీప నీటివనరులు కాలుష్యం బారిన పడే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, సిద్దిపేట మెడికల్ కాలేజీ, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వాస్పత్రుల్లో కూడా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రూ.52.59 కోట్లను ప్లాంట్ల ఏర్పాటుకు, మరో రూ.15.72 కోట్లు మూడేళ్లపాటు ఈ ప్లాంట్ల నిర్వహణకు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీల నుంచి వెలువడే వ్యర్థాలతోపాటు పేషెంట్ల బెడ్లను, బెడ్ షీట్లను, వార్డులను శుభ్రం చేసే సమయంలో వెలువడే వ్యర్థాల్లోని వైరస్లు పలు ఇన్ఫెక్షన్లు, కాలుష్యానికి కారకమవుతాయని హరీశ్ చెప్పారు. -
రూ.70 కోట్లతో ఎస్టీపీల అభివృద్ధి
మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గంలోని ముఖ్యమైన చెరువుల వద్ద సుమారు రూ.70 కోట్లతో ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. సఫిల్‌గూడలోని ఎస్టీపీతో పాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న బండ చెరువు ప్రాంతాలను శనివారం ఆయన జలమండలి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సఫిల్‌గూడ లోని 0.5 ఎంఎల్డీ ప్లాంట్ సామర్థ్యాన్ని సుమారు రూ.12.45 కోట్లతో 5.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీగా మార్చుతున్నామన్నారు. బండచెరువు వద్ద సుమారు 28.15 కోట్లతో 15 ఎంఎల్డీ ఎస్టీపీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు కోసం పిల్లి నర్సింగరావు కాలనీలో సుమారు మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామన్నారు. ఆల్వాల్ కొత్త చెరువు వద్ద సుమారు రూ.28.90 కోట్లతో 15.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు, నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎమ్మెల్యే వెంట జలమండలి ప్రాజెక్ట్ అధికారి నరేందర్‌కుమార్, జీఎం సునీల్‌కుమార్, డీజీఎంలు స్రవంతి రెడ్డి, భాస్కర్, జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ డీసీ జి.రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేష్, తహసీల్దార్ వినయలత, ఉన్నారు. చెరువుల ప్రక్షాళనకు చర్యలు.. అల్వాల్: అల్వాల్‌లో చెరువుల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఆయన అధికారులు, కార్పొరేటర్లతో కలిసి అల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు. భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతున్న అల్వాల్‌లోని మోత్కుల కుంట చెరువు, కొత్త చెరువు, చిన్నరాయుడి చెరువులలో మురుగు నీరు కలుస్తుండటంతో నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. చెరువులలోకి వరదనీటిని మళ్లించడంతో పాటు వ్యర్థాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఇందుకోసం రూ.1 50 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, ప్రేంకుమార్, డీసీ నాగమణి, అధికారులు నాగేందర్, నిర్మల, పవన్‌కుమార్, ఈఈ రాజు, డీఈలు మహేష్ , ప్రశాంతి, ఏఈ, లక్ష్మీ, జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా వసతుల కల్పన అల్వాల్: వెంకటాపురం డివిజన్లో అన్ని కాలనీల్లో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రూ.1.03 కోట్ల వ్యయంతో భూదేవినగర్, సుభాష్‌నగర్, ఇందిరానగర్‌లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన కార్పొరేటర్ సబితాకిషోర్‌తో కలిసి ప్రారంభించారు. -
గ్రేటర్ పరిధిలో మురికి నీళ్లతో మనీ మనీ!
-
మురికి నీళ్లతో మనీ మనీ!
- సంపద సృష్టికి జలమండలి వ్యూహం - శుద్ధి నీరు గార్డెనింగ్, నిర్మాణ రంగాలకు వినియోగం - ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.50 నుంచి రూ.100కు విక్రయం - మార్చి నుంచి ప్రయోగాత్మకంగా అమలుకు సన్నాహాలు - వేసవిలో భూగర్భజలాలు, ట్యాంకర్ నీళ్లపై ఒత్తిడి తగ్గించేందుకే.. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యర్థ జలాలను వృథా చేయకుండా సరికొత్త అర్థం ఇవ్వడమే కాదు.. తద్వారా సంపద సృష్టించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. మహానగరంలో రోజురోజుకూ నీటి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో మురుగు శుద్ధి కేంద్రా(ఎస్టీపీ)ల్లో మూడు రకాల ప్రక్రియలతో శుద్ధి చేసిన వ్యర్థ జలాలను గార్డెనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, కార్ క్లీనింగ్, నిర్మాణ రంగంలో సిమెంట్, కాంక్రీట్ కట్టడాలకు క్యూరింగ్ తదితర అవసరాలకు విక్రయించేందుకు త్వరలో శ్రీకారం చుట్టనుంది. మార్చి నెలలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే వేసవిలో భూగర్భ జలాలు, ట్యాంకర్ నీళ్లపై ఒత్తిడిని గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో రోజువారీగా సుమారు 1,400 మిలియన్ లీటర్ల(140 కోట్ల లీటర్లు)మేర మురుగు జలాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో 750 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి శుద్ధిచేసి మూసీ, ఇతర చెరువుల్లోకి వదిలిపెడుతున్న విషయం విదితమే. అయితే ఇకపై శుద్ధి చేసిన నీటిని డిమాండ్‌ను బట్టి ఐదు వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.50 నుంచి రూ.100కు విక్రయించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. వ్యర్థ జలాల వినియోగంతో హరితహారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహానగరంలో హరితం 5 శాతం లోపే ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో గార్డెనింగ్ అవసరాలు, హరితహారంలో భాగంగా నాటిన కోట్లాది మొక్కల సంరక్షణకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీగా ఉత్పన్నమవుతున్న 1,400 మిలియన్ లీటర్ల మురుగునీటిని అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, నానక్‌రాంగూడాలోని భారీ మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద సుమారు 650 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తుండగా.. గతంలో హెచ్ఎండీఏ నగరం నలుమూలలా ఏర్పాటు చేసిన 14 మినీ మురుగు శుద్ధి కేంద్రాల్లో మరో 100 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేస్తున్నారు. మొత్తంగా 750 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేసి మూసీతోపాటు పలు జలాశయాల్లోకి వదిలిపెడుతున్నారు. వ్యర్థజలాల శుద్ధి.. వినియోగం ఇలా... గ్రేటర్ పరిధిలో వెలువడుతున్న మురుగు జలాలను జలమండలి మూడు రకాల విధానాల ద్వారా శుద్ధి చేస్తోంది. ముందుగా గృహ, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి నాలాలు, ప్రత్యేక కాల్వలు, పైప్‌లైన్ వ్యవస్థల ద్వారా చేరుతున్న మురుగునీటిలోని ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను తొలిదశలో తొలగిస్తోంది. రెండో దశలో ఇందులోని మలినాలను వడగట్టేందుకు సెడిమెంటేషన్ ట్యాంక్‌ల్లోకి పంపుతోంది. మూడో దశలో జలాల్లోని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ), బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ), కరిగిన ఆక్సిజన్ స్థాయిలు, కరిగిన ఘన పదార్థాలను పర్యావరణానికి హానికలిగించని స్థాయిలో ఉండేలా శుద్ధి చేసి.. మూసీతోపాటు పలు చెరువుల్లోకి వదులుతోంది. ఈ నీటినే నిర్మాణ రంగంలో క్యూరింగ్, సిమెంట్, కాంక్రీట్, ఇసుక మిశ్రమాలను కలిపేందుకు, కార్ల వాషింగ్, నగరంలోని పలు పార్కులు, కేంద్ర, రాష్టప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఉన్న పార్కుల్లో గార్డెనింగ్ అవసరాలకు వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శుద్ధి చేసిన నీటిని ఐదు వేల లీటర్ల ట్యాంకర్‌ను రూ.50 నుంచి రూ.100కు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి ధరను తగ్గించే అవకాశం ఉందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తాగునీటి ట్యాంకర్‌ను వినియోగదారునికి రూ.400కి(ఐదువేల లీటర్ల నీటికి) అందిస్తోంది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాశయాల నుంచి మహానగరనానికి తరలిస్తున్న నీటిలో ప్రతి వేయి లీటర్ల నీటిశుద్ధికి జలమండలి రూ.45 నుంచి రూ.50 ఖర్చు చేస్తోంది. ప్రస్తుతానికి 750 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసేందుకు మాత్రమే జలమండలి వద్ద ఎస్టీపీలు ఉన్నాయి. మరో 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు మరో 10 ఎస్టీపీలు, రెండు రీసైక్లింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు రూ.1,200 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను జలమండలి సిద్ధం చేసింది. వ్యర్థజలాల పునర్వినియోగంతో లాభాలివీ.. భూగర్భ జలాలను అక్రమ బోరుబావుల ద్వారా తోడే అవకాశం ఉండదు. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గుతుంది. నిర్మాణ రంగం, గార్డెనింగ్ అవసరాలకు తాగునీటిని వాడే అవకాశం ఉండదు. తద్వారా పేదల గొంతు తడిపే అవకాశం ఉంటుంది. వ్యర్థజలాల పునర్వినియోగంతో నీటివృథా, పొదుపుగా వాడే అంశంపై అన్ని వర్గాల్లో అవగాహన కలుగుతుంది. కార్ వాషింగ్, ఫ్లోర్ క్లినింగ్ అవసరాలకు ఈ నీటిని వినియోగించవచ్చు. హరితహారంలో నాటిన కోట్లాది మొక్కలను ఈ వేసవిలో సంరక్షించవచ్చు. గ్రేటర్ మురుగునీటి పారుదల వ్యవస్థ ముఖచిత్రం ఇదీ.. గ్రేటర్ విస్తీర్ణం: 625 చదరపు కిలోమీటర్లు జనాభా: సుమారు కోటి రోజువారీగా వెలువడుతున్న మురుగునీటి పరిమాణం: 1400 మిలియన్ లీటర్లు(గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థాలు) ప్రస్తుతం శుద్ధి చేస్తున్న మురుగు నీరు: 750 మిలియన్ లీటర్లు జలమండలి పరిధిలోని భారీ మురుగుశుద్ధి కేంద్రాలు: 5(నాగోల్, నల్లచెరువు, అంబర్పేట్, అత్తాపూర్, నానక్రాంగూడా) హెచ్ఎండీఏ నుంచి జలమండలికి బదిలీ చేసిన మినీ ఎస్టీపీలు: 14 మురుగునీటిపారుదల వ్యవస్థకు అందుబాటులో ఉన్న పైప్లైన్లు: 5 వేల కిలోమీటర్లు మురుగునీటిపైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లు: 1.85 లక్షలు -
మళ్లీ ఆగిన బాయిలర్
బరువెక్కువై తెగిన మాస్టర్ లింక్ అశ్వారావుపేట : అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రెండో బాయిలర్ మళ్లీ నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బాయిలర్ నుంచి పెద్ద శబ్దం రావడంతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలే అవినీతి ఆరోపణలు, కాసుల కక్కుర్తితో నాసిరకం బాయిలర్‌ను కొనుగోలు చేశారు.. ఏ క్షణాన్నయినా బాయిలర్ పేలొచ్చనే ఆరోపణలుండటంతో అందరి దృష్టి బాయిలర్పైనే పడింది. తీరా చూస్తే ఊహించినంత కాకున్నా.. దాదాపు అంతే అయినంత పనయింది. బాయిలర్ ఫర్నెస్‌కు పీచును పంపించే మాస్టర్ లింక్ చై¯ŒS తెగిపోయి.. అక్కడి నుంచి ఫర్నెస్‌కు పీచు వెళ్లే మార్గం ఊడిపోయింది. ఆద్యంతం విమర్శలున్నా.. ఇదే బాయిలర్‌ను కొనసాగిస్తున్నారు. బంకర్ కేపాసిటీ ఇక్కడున్న కార్మికులకు, ఇంజనీర్లకు, నిర్మించిన టెక్నికల్ సిబ్బందికి తెలియకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మేనేజర్ హరినాథ్‌బాబు దృష్టికి కార్మికులు తీసుకువెâýæ్లగా బంకర్‌కు ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టం ఏర్పాటు చేసే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాయిలర్ నిర్మించిన కంపెనీ బృందం బాయిలర్‌ను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు.