- బరువెక్కువై తెగిన మాస్టర్ లింక్
మళ్లీ ఆగిన బాయిలర్
Published Tue, Oct 4 2016 11:09 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
అశ్వారావుపేట : అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రెండో బాయిలర్ మళ్లీ నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బాయిలర్ నుంచి పెద్ద శబ్దం రావడంతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలే అవినీతి ఆరోపణలు, కాసుల కక్కుర్తితో నాసిరకం బాయిలర్‌ను కొనుగోలు చేశారు.. ఏ క్షణాన్నయినా బాయిలర్ పేలొచ్చనే ఆరోపణలుండటంతో అందరి దృష్టి బాయిలర్‌పైనే పడింది. తీరా చూస్తే ఊహించినంత కాకున్నా.. దాదాపు అంతే అయినంత పనయింది. బాయిలర్ ఫర్నెస్‌కు పీచును పంపించే మాస్టర్ లింక్ చై¯ŒS తెగిపోయి.. అక్కడి నుంచి ఫర్నెస్‌కు పీచు వెళ్లే మార్గం ఊడిపోయింది. ఆద్యంతం విమర్శలున్నా.. ఇదే బాయిలర్‌ను కొనసాగిస్తున్నారు. బంకర్ కేపాసిటీ ఇక్కడున్న కార్మికులకు, ఇంజనీర్లకు, నిర్మించిన టెక్నికల్ సిబ్బందికి తెలియకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మేనేజర్ హరినాథ్‌బాబు దృష్టికి కార్మికులు తీసుకువెâýæ్లగా బంకర్‌కు ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టం ఏర్పాటు చేసే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాయిలర్ నిర్మించిన కంపెనీ బృందం బాయిలర్‌ను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు.
Advertisement
Advertisement