busstand
-
కరీంనగర్ బస్‌స్టాండ్‌లో అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన
సాక్షి,కరీంనగర్ జిల్లా : కరీంనగర్ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఒక డ్రైవర్ డ్యూటీ ఎక్కే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతడు మద్యం తాగినట్లు వచ్చింది. అయితే తాను ఎలాంటి మద్యం సేవించలేదని, అసలు తనకు మద్యం తాగే అలవాటే లేదని డ్రైవర్ చెబుతున్నాడు. దీంతో అద్దె బస్సుల డ్రైవర్లు అంతా కలిసి బస్సులు తీయకుండా బస్‌స్టాండ్‌లో ఆందోళనకు దిగారు. దీంతో బస్స్టాండ్లోనే బస్సులు నిలిచిపోయాయి. ప్రైవేటు బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ
-
తిరుపతి బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్
-
ఆర్టీసీ బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆప్కో వస్త్రాలకు మరింత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపిక చేసిన ఆర్టీసీ బస్టాండ్లలో అందుకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌కు ఆప్కో వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేఖ రాశారు. ఫ్లిప్‌కార్డ్, అమెజాన్, మింత్ర, పేటీఎం, లూమ్‌ఫ్లోక్స్ తదితర ఈ–కామర్స్ సంస్థలతో ఆప్కో ఎంవోయూ కుదుర్చుకుందని లేఖలో వివరించారు. ఆప్కో వ్యాపారాభివృద్ధికి బస్టాండ్లలో స్టాళ్లు కేటాయిస్తే వ్యాపారం పెరుగుతుందని.. అందువల్ల నామమాత్రపు అద్దెలతో స్టాళ్లను కేటాయించాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. స్టాళ్లకు నెలనెలా ఎంత అద్దె వసూలు చేయాలనే అంశాన్ని నిర్ణయించేందుకు త్వరలో నివేదిక ఇవ్వాలని ఎండీ ఠాకూర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు కాగా, ఈ విక్రయ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా 15 బస్టాండ్లలో ఏర్పాటుచేయనున్నారు. కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలు పెంచాలన్నదే లక్ష్యం. ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం బస్టాండ్లలో వీటిని ఏర్పాటుచేస్తారు. అమూల్ మిల్క్ యూనిట్లకు అవకాశం బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లకే కాకుండా అమూల్ మిల్క్ యూనిట్లకు స్టాళ్లను కేటాయించేందుకు ఆర్టీసీ సుముఖంగా ఉంది. కొన్ని బస్టాండ్లలో సంగం డెయిరీకి స్టాళ్లను కేటాయించిన సంగతి తెలిసిందే. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని పాడి రైతుల అభివృద్ధికి పాటు పడుతున్నందున అమూల్ ఉత్పత్తులకూ స్టాళ్లను ఆర్టీసీ కేటాయించనుంది. ఇదేకాక విశాఖపట్నం ద్వారకా బస్టాండ్‌లో మత్స్యశాఖకు ఓ స్టాల్‌ను ఆర్టీసీ అధికారులు ఇటీవలే కేటాయించారు. త్వరలో స్టాళ్లను కేటాయిస్తాం ఆప్కో ఎండీ కోరిక మేరకు రాష్ట్రంలో ప్రధాన బస్టాండ్లలో స్టాళ్లను త్వరలోనే కేటాయిస్తున్నాం. దీనిద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే ఆర్టీసీ నడుచుకుంటుంది. – ఆర్పీ ఠాకూర్, ఎండీ, ఆర్టీసీ -
ఇంటిగ్రేటెడ్ స్టేషన్లుగా ఆర్టీసీ బస్టాండ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఆర్టీసీ బస్స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వాటిని ఇంటిగ్రేటెడ్ స్టేషన్లుగా మార్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రూ.150 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఆయా బస్స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలతోపాటు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లను నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటి నిర్మాణం ఉండనుంది. అంతేకాకుండా మరో 21 బస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుతానికి మొత్తం ఐదు జిల్లాల్లో ఆర్టీసీ స్థలాలను కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా మారుస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో .. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఐదు జిల్లాల్లో ఏడు చోట్ల బస్ స్టేషన్లను నిర్మిస్తారు. ఇందుకోసం ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్ ఎంపిక కోసం ఆర్టీసీ ఇటీవలే టెండర్లు పిలిచింది. ఆటోనగర్– విజయవాడ, హనుమాన్ జంక్షన్ (కృష్ణా), తిరుపతి (చిత్తూరు), మద్దిలపాలెం, నర్సీపట్నం (విశాఖ), కర్నూలు, నరసరావుపేట (గుంటూరు) ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేశారు. ఒక్కో బస్టాండ్‌ను రూ.10 కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు కేటాయించనున్నారు. వైఫై సదుపాయం, మరుగుదొడ్ల విస్తరణ, రీ–పెయింటింగ్, ర్యాంపులు, రైయిలింగ్‌ల నిర్మాణం, డిజిటల్ డిస్ ప్లే బోర్డులు తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం,, కాకినాడ సహా పలు ప్రాంతాల్లో బస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. (అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్) -
ఉన్నా.. లేనట్లే!
సాక్షి, తిమ్మాజిపేట: రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన తిమ్మాజిపేట ఆర్టీసీ బస్టాండ్ వృథాగా మారింది. మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.12 లక్షలతో నిర్మించిన బస్టాండ్‌ను అప్పటి ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ 2001 మేలో ప్రారంభించారు. కొంతకాలం పాటు బస్సులు బస్టాండ్‌లోకి రాకపోకలు కొనసాగించాయి. ఆ తర్వాత బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లకపోవడంతో ప్రయాణికులు సైతం బస్టాండ్‌లోకి వెళ్లడం లేదు. దీంతో రోడ్డుపైనే బస్సులు ఆపడంతో ప్రయాణికులు సైతం అక్కడే ఎక్కుతున్నారు. అధికారుల హడావుడి.. గత ఏడాది ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. బస్టాండ్‌కు రంగులు వేయించి అవరణను శుభ్రం చేయించారు. నేల రోజుల పాటు బస్సులను బస్టాండ్‌లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ సిబ్బందిని సైతం నియమించి బస్సుల రాకపోకలకు సాగేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం సిబ్బందిని తొలగించడంతో బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీకి ఆదాయం గండి పడుతుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బస్సులను బస్టాండ్‌లోకి వెళ్లే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపైనే బస్సుల కోసం నిల్చుని ఎదురుచూస్తున్నాం. వర్షాకాలంలో, వేసవి కాలంలో రోడ్డుపైనే ఉండాల్సి వస్తుంది. అధికారులు చొరవ తీసుకుని బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లే విధంగా చూడాలి. – కృష్ణ, కోడవత్ తండా -
జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు
శ్రీనగర్ : జమ్మూ బస్టాండ్ సమీపంలో ఓ బస్సులో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. బస్సులో బాంబు పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా, బాంబు పేలుడు ఘటనలో 30 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. బస్సుపై గ్రనేడ్ దాడి జరిగిందని జమ్మూ ఐజీ నిర్ధారించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా పుల్వామా ఉగ్రదాడి, ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ బస్టాండ్‌లోని బస్సులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, పోలీసు సిబ్బంది పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
ఎర్రగుంట్ల బస్టాండ్.. చోరీలకు కేరాఫ్
వైఎస్ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్ చోరీలకు నిలయంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ బస్సులు ఎక్కాలంటేనే ఏ బ్యాగులో నుంచి ఏ వస్తువు చోరీ చేస్తారో.. ఎవరి జేబులో నుంచి ఎంత నగదు మాయమవుతుందో.. ఎవరి పర్సు కొట్టేస్తారో.. అనే భయం ప్రయాణికులను వెంటాడుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు మాత్రం హస్త లాఘవం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడ సెల్ ఫోన్లు, బంగారు , డబ్బులు చోరీ కావడం నిత్యకృత్యమైంది. బుధవారం ఏకంగా ఓ వ్యక్తి నిక్కరు జేబును బ్లేడ్‌తో కోసి రూ.2 లక్షలు నగదు దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లో బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు పెరిగిపోవడమే గాని చోరీల నియంత్రణకు పోలీసులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. నిఘా కెమెరాలు ఉన్నా లేనట్టే.. ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుస్తోంది. ఈ కెమెరాలు ఉన్న డైరెక్షన్లో చెట్లు అడ్డంగా ఉండడంతో చోరీ జరిగిన సంఘటనలు అందులో నమోదు కాలేకపోతున్నాయి. ఒక వేళ నమోదయినా దొంగలు సరి గా కన్పించడంలేదు. అంతేకాక బస్సులు కూడా నిఘా కెమెరాలకు అడ్డంగా వస్తుండడంతో ప్రయాణికులు బస్సు ఎక్కే దృశ్యాలు నమోదు కాలేక పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బస్టాండులో నిఘా ఏర్పాటు చేసి అ నుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకుని చోరీలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
బస్టాండ్‌లో ప్రసవం
వరంగల్, కాశిబుగ్గ: నెలలు నిండడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లడానికి బస్సులో వచ్చిన గర్భిణి బస్టాండ్‌లోనే ప్రసవించింది. వరంగల్ రూరల్ జిల్లా చింతనెక్కొండకు చెందిన బట్టు నరేష్ భార్య శైలజ గర్భిణి. ప్రతి నెలా సీకేఎం ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. ఫిబ్రవరిలోనే నెలలు నిండాయని, చివరి వారంలో ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని డాక్టర్లు సూచించారు. సమయం దాటిపోయిందని గుర్తించిన రజిత అత్తమ్మను వెంట తీసుకుని బస్సులో వరంగల్ సీకేఎం ఆస్పత్రికి బయలుదేరింది. బస్టాండ్‌లో బస్సుదిగి ప్లాట్‌ఫామ్ మీదకు చేరుకోగానే నడవలేక అక్కడే కూర్చుంది. నొప్పులు ఎక్కువై అక్కడే ప్రసవించింది. గమనించిన ప్రయాణికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రాథమిక వైద్యం చేసి సీకేం ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
బస్టాండ్‌లోనే మహిళ ప్రసవం
కదిరి టౌన్ : కదిరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే గురువారం ఓ మహిళ ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వాయలపాడులోని రామయ్యకాలనీకి చెందిన జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి ఓ పని నిమిత్తం కదిరికి వచ్చారు. గురువారం స్వగ్రామానికి వెళ్లేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. జ్యోతికి ఉన్నఫలంగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారమిచ్చారు. పైలట్ మహబూబ్‌బాషా, ఈఎంటీ లక్ష్మినారాయణ, ఆ సమయంలో అక్కడే అందుబాటులో ఉన్న మలేరియా నివారణ యూనిట్ సూపర్వైజర్ మహబూబ్‌బాషా వెంటనే అక్కడికి చేరుకున్నారు. వాహనంలోకి చేర్చేలోపే బస్టాండు ప్రాంగణంలోనే ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీబిడ్డను సురక్షితంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేర్చారు. -
అసౌకర్యాలకు నిలయం.. కొత్తబస్టాండ్
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ అసౌకర్యాలకు నిలయంగా మారింది. మూత్రశాలల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రయాణికులు, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు బస్టాంyŠ కు వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్ ఆవరణలో చెత్తాచెదారంతో దోమలు, ఈగలు విపరీతంగా ఉన్నాయి. పందులు బస్టాండ్ ఆవరణలోనే సంచరిస్తున్నాయి. ముఖ్యంగా బస్టాండ్‌లో ఉన్న మురుగు దొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లో కూర్చునే పరిస్థితి లేదు. ప్రయాణికులు బస్సు కోసం కొద్ది సేపు వేచి చూడాల్సినప్పుడు మరుగుదొడ్ల దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు రోజు రోజు శుభ్రం చేయించకపోవడంతోనే ఇలా దుర్వాసన వస్తుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరుగు దొడ్లు శుభ్రం చేయించడంలో అధికారులు పట్టించుకోవడం లేదు. కొద్దిపాటి వర్షం వస్తే చాలు బస్టాండ్ ఆవరణలో నీళ్లు నిలిచి పందులు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రయాణికులకు మంచినీటి సౌకర్యం కూడా లేదు. దీంతో ప్రయాణికులు ఒక్క బాటిల్‌కు రూ. 20 నుంచి రూ. 30వరకు వెచ్చించి కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్‌లో ఫ్యాన్లు లేకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వచ్చే ఈబస్టాండ్‌లో మరుగు దొడ్లు దుర్వాసన రాకుండా చేయాలని, మంచినీటి సౌకర్యంతో పాటు బస్టాండ్‌లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దుర్వాసనతో ఉండలేకపోతున్నాం – పిట్టల జానయ్య, ప్రయాణికుడు మరుగుదొడ్ల దుర్వాసనతో బస్టాండ్‌లోకి వచ్చి నిలబడలేకపోతున్నాం. బస్సు కోసం కొద్ది సేపు చూడాలంటే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. మరుగు దొడ్లు రోజు రోజు శుభ్రం చేయించాలి. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి – పి.లింగస్వామి, ప్రయాణికుడు బస్టాండ్‌లో మంచినీటి సౌకర్యం లేదు. దీంతో మంచినీటి బాటిల్‌ను రూ. 20 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అవి ఒక్కడికే సరిపోతున్నాయి. ముగ్గురు నలుగురు తాగాలంటే రూ. 100 వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఆర్టీసీ అధికారులు స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలి. -
వేములవాడలో అతిపెద్ద బస్టాండ్
స్థలాన్ని పరిశీలించిన అధికారులు వేములవాడ : వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం గుడిచెరువు కట్టకింద 20 ఎకరాల్లో 40 ప్లాట్‌ఫాంలతో అతిపెద్ద బస్టాండ్ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థలాన్ని టూరిజం, వీటీడీఏ, స్థానిక అధికారులు ఆదివారం పరిశీలించారు. బస్టాండుతోపాటు డార్మెటరీహాల్, సమాచారకేంద్రాలు నిర్మించనున్నట్లు చెప్పారు. వీటీడీఏ ఎస్టేట్ ఆఫీసర్ రమేశ్ లొలేవార్, ఆర్కిటెక్ నాగరాజు, ముక్తీశ్వర్, ఆలయ డీఈ రఘునందన్, సైస్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నామాల లక్ష్మీరాజం, పొలాస నరేందర్, పెంట బాబు, ఇప్పపూల విజయ్, పుల్కం రాజు, నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చిత్తూరు బస్టాండ్ లో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు: చిత్తూరు జిల్లా పాతబస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాడీపై ఎటువంటి గాయాలు లేకపోవడం, నోట్లో నుంచి నురుగ వస్తుండటంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. -
ఖానాపూర్ బస్టాండ్‌లో గుర్తు తెలియని చిన్నారి
ఖానాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని బస్టాండులో గుర్తు తెలియని చిన్నారి(3)ని స్థానికులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం బస్టాండ్‌లో ఓ బాలిక ఏడుస్తూ తిరుగుతుండగా అక్కడి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను స్టేషన్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎవరో అక్కడ కావాలనే వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
గుట్ట..గోవిందా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఆర్టీసీ బస్టాండ్‌కు ఆనుకుని ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయం వెనుక భాగంలో గోవిందరాజుల గుట్ట పరిసరాల్లో మొదట 20 ఎకరాల మేరకు ప్రభుత్వ స్థలం ఉండేదని చెబుతుంటారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు ఆలయ భూముల్లోనే ఉన్నట్లు చెబుతారు. ఐదు దశాబ్దాలుగా ఈ భూమి క్రమక్రమంగా ఆక్రమణకు గురవుతూ వచ్చింది. ప్రస్తుతానికి సర్వే నంబర్ 15/1లో 5.25 ఎకరాల భూమి ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడు అది కూడా కనిపించడం లేదు. రెవెన్యూ శాఖ అధికారులు ప్రమేయంతోనే ఈ భూములు పరాధీనమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఎకరానికి రూ.కోటికిపైగా పలుకుతోంది. ఈ లెక్కన చూసినా రూ.పది కోట్ల విలువైన భూమి పరాధీనమైనట్టే. ఇక్కడి భూముల్లో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓ వ్యక్తికి అధికారికంగా కేటాయించింది. తర్వాత కాలంలో దీన్ని కొనుగోలు చేసిన కొందరు మొత్తం ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టారు. ఈ సమీపంలోని వ్యాపారులు అధికార పార్టీ నేతల అండదండలతో గుట్ట భూములను ఆక్రమించేశారు. ఇలా కబ్జాలతో గుట్ట పరిసరాల్లోని భూమి మొత్తం భవనాలతో నిండిపోయింది. ఇప్పుడు కబ్జాదారులు ఏ కంగా గుట్టనే పగులగొట్టి గ్రానైట్‌ను తరలిస్తున్నారు. గుట్ట కింద ప్రభుత్వ భూమి లో పురాతనమైన నరసింహస్వామి విగ్రహం ఉండేదని స్థానికులు చెబుతున్నా రు. రోడ్డు వెడల్పులో విగ్రహాలు సైతం బయట పడ్డాయి. ఇక్కడి ఆలయ భూములను రక్షించాలని స్థానికులు పలుసార్లు... జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్‌కు, మండల కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. దీంతో తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే సైతం నిర్వహించారు. కొంత పట్టా భూమి ఉందని, మిగిలినందా సర్కారుదేనని తేల్చారు. ఎంత పట్టా భూమి, ఎంత ప్రభుత్వ భూమి అనేది మా త్రం అధికారులు స్పష్టం చేయలేదు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవె న్యూ శాఖ అధికారులే భూమి లెక్కలు లేల్చకపోవడంతో కబ్జాదారులు ఆక్రమణ పర్వం పూర్తి చేశారు. ఇప్పుడు ఆలయ భూమి అనేది లేకుండా పోరుుంది.