అసౌకర్యాలకు నిలయం.. కొత్తబస్టాండ్
అసౌకర్యాలకు నిలయం.. కొత్తబస్టాండ్
Published Sun, Aug 14 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
సూర్యాపేటటౌన్ :
పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ అసౌకర్యాలకు నిలయంగా మారింది. మూత్రశాలల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రయాణికులు, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు బస్టాంyŠ కు వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్ ఆవరణలో చెత్తాచెదారంతో దోమలు, ఈగలు విపరీతంగా ఉన్నాయి. పందులు బస్టాండ్ ఆవరణలోనే సంచరిస్తున్నాయి. ముఖ్యంగా బస్టాండ్‌లో ఉన్న మురుగు దొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లో కూర్చునే పరిస్థితి లేదు. ప్రయాణికులు బస్సు కోసం కొద్ది సేపు వేచి చూడాల్సినప్పుడు మరుగుదొడ్ల దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు రోజు రోజు శుభ్రం చేయించకపోవడంతోనే ఇలా దుర్వాసన వస్తుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరుగు దొడ్లు శుభ్రం చేయించడంలో అధికారులు పట్టించుకోవడం లేదు. కొద్దిపాటి వర్షం వస్తే చాలు బస్టాండ్ ఆవరణలో నీళ్లు నిలిచి పందులు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రయాణికులకు మంచినీటి సౌకర్యం కూడా లేదు. దీంతో ప్రయాణికులు ఒక్క బాటిల్‌కు రూ. 20 నుంచి రూ. 30వరకు వెచ్చించి కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్‌లో ఫ్యాన్‌లు లేకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వచ్చే ఈబస్టాండ్‌లో మరుగు దొడ్లు దుర్వాసన రాకుండా చేయాలని, మంచినీటి సౌకర్యంతో పాటు బస్టాండ్‌లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
దుర్వాసనతో ఉండలేకపోతున్నాం – పిట్టల జానయ్య, ప్రయాణికుడు
మరుగుదొడ్ల దుర్వాసనతో బస్టాండ్‌లోకి వచ్చి నిలబడలేకపోతున్నాం. బస్సు కోసం కొద్ది సేపు చూడాలంటే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. మరుగు దొడ్లు రోజు రోజు శుభ్రం చేయించాలి. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.
మంచినీటి సౌకర్యం కల్పించాలి – పి.లింగస్వామి, ప్రయాణికుడు
బస్టాండ్‌లో మంచినీటి సౌకర్యం లేదు. దీంతో మంచినీటి బాటిల్‌ను రూ. 20 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అవి ఒక్కడికే సరిపోతున్నాయి. ముగ్గురు నలుగురు తాగాలంటే రూ. 100 వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఆర్టీసీ అధికారులు స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలి.
Advertisement
Advertisement