చిత్తూరు: చిత్తూరు జిల్లా పాతబస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాడీపై ఎటువంటి గాయాలు లేకపోవడం, నోట్లో నుంచి నురుగ వస్తుండటంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు.