ఖానాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని బస్టాండులో గుర్తు తెలియని చిన్నారి(3)ని స్థానికులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం బస్టాండ్‌లో ఓ బాలిక ఏడుస్తూ తిరుగుతుండగా అక్కడి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను స్టేషన్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎవరో అక్కడ కావాలనే వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.