వేములవాడ : వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం గుడిచెరువు కట్టకింద 20 ఎకరాల్లో 40 ప్లాట్‌ఫాంలతో అతిపెద్ద బస్టాండ్ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థలాన్ని టూరిజం, వీటీడీఏ, స్థానిక అధికారులు ఆదివారం పరిశీలించారు. బస్టాండుతోపాటు డార్మెటరీహాల్, సమాచారకేంద్రాలు నిర్మించనున్నట్లు చెప్పారు.
-
స్థలాన్ని పరిశీలించిన అధికారులు
వేములవాడ : వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం గుడిచెరువు కట్టకింద 20 ఎకరాల్లో 40 ప్లాట్‌ఫాంలతో అతిపెద్ద బస్టాండ్ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. స్థలాన్ని టూరిజం, వీటీడీఏ, స్థానిక అధికారులు ఆదివారం పరిశీలించారు. బస్టాండుతోపాటు డార్మెటరీహాల్, సమాచారకేంద్రాలు నిర్మించనున్నట్లు చెప్పారు. వీటీడీఏ ఎస్టేట్ ఆఫీసర్ రమేశ్ లొలేవార్, ఆర్కిటెక్ నాగరాజు, ముక్తీశ్వర్, ఆలయ డీఈ రఘునందన్, సైస్ డైరెక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు నామాల లక్ష్మీరాజం, పొలాస నరేందర్, పెంట బాబు, ఇప్పపూల విజయ్, పుల్కం రాజు, నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.