సాక్షి,కరీంనగర్‌జిల్లా: ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం(నవంబర్ 20)వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు.
‘నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశాం.రాబోయే నాలుగు ఏళ్ళలో 20 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాం.ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ..ప్రతి పేదవాడికి పక్కా ఇళ్ళు ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ రెవెన్యూ చట్టం 2024 రాబోతోంది.
ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారు.ఆ భూములను ప్రజా ప్రభుత్వం తీసుకుని పేదలకు పంచి పెడుతాం’అని పొంగులేటి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment