సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వాటిని ఇంటిగ్రేటెడ్ స్టేషన్లుగా మార్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రూ.150 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఆయా బస్‌స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలతోపాటు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా హాళ్లను నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటి నిర్మాణం ఉండనుంది. అంతేకాకుండా మరో 21 బస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుతానికి మొత్తం ఐదు జిల్లాల్లో ఆర్టీసీ స్థలాలను కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా మారుస్తారు.
అత్యాధునిక సౌకర్యాలతో ..
పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఐదు జిల్లాల్లో ఏడు చోట్ల బస్ స్టేషన్లను నిర్మిస్తారు. ఇందుకోసం ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్ ఎంపిక కోసం ఆర్టీసీ ఇటీవలే టెండర్లు పిలిచింది. ఆటోనగర్– విజయవాడ, హనుమాన్ జంక్షన్ (కృష్ణా), తిరుపతి (చిత్తూరు), మద్దిలపాలెం, నర్సీపట్నం (విశాఖ), కర్నూలు, నరసరావుపేట (గుంటూరు) ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేశారు. ఒక్కో బస్టాండ్‌ను రూ.10 కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు కేటాయించనున్నారు. వైఫై సదుపాయం, మరుగుదొడ్ల విస్తరణ, రీ–పెయింటింగ్, ర్యాంపులు, రైయిలింగ్‌ల నిర్మాణం, డిజిటల్ డిస్ ప్లే బోర్డులు తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం,, కాకినాడ సహా పలు ప్రాంతాల్లో బస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. (అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment