Laticharge
-
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఊహించని షాక్
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను ప్రజలు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంతసేపటికీ వారు కదలకపోవడంతో యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. -
మునుగోడులో పోలీసుల లాఠీచార్జ్.. కోట్ల రూపాయల బెట్టింగ్‌లు!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, చండూరు, కొరిటికల్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. నాన్ లోకల్స్ తిరుగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇక, మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. మునుగోడులో పోలింగ్ జోరందుకుంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్ తండాలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, తండావాసులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు మునుగోడులో 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. క్యూలైన్లలో ఓటర్లు బారులుతీరడంతో భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. కాగా, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక, 2018లో మునుగోడు నియోజకవర్గంలో 91.3 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో రకంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
ఇది పోలీసుల హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలోని కర్నాల్ జిల్లా రాయ్‌పూర్ జట్టన్ గ్రామానికి చెందిన రైతు సుశీల్ కాజల్ మృతికి పోలీసులే కారణమని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల లాఠీఛార్జ్ వల్లనే రైతు సుశీల్ మరణించాడని ఆయన భార్య సుదేష్ దేవీ, తల్లి విమర్శించారు. ఆయన పోలీసులు చెబుతున్న విధంగా గుండెపోటుతో మరణించలేదని వారు వాదిస్తున్నారు. పోలీసులు, హరియాణా ప్రభుత్వం కావాలనే సుశీల్ గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాఠీచార్జ్ సందర్భంగా తగిలిన తీవ్రమైన గాయాలు, నొప్పులతో ఇంటికి చేరుకున్న సుశీల్, తల్లి తీసుకొచ్చిన పసుపు కలిపిన పాలను తాగి... తనకు ఏమీ తినాలని అనిపించట్లేదని చెప్పి పెయిన్ కిల్లర్ మాత్రలను వేసుకొని పడుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే రాత్రి నొప్పులతో బాధపడుతూ ప్రాణాలు విడిచారని ఆయన భార్య, తల్లి వివరించారు. గాయాలకు, మరణానికి సంబంధం లేదు: కర్నాల్ ఎస్పీ పునియా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 28న కర్నాల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలోలో సుశీల్ కాజల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆ ఘటనలో గాయపడ్డ రైతుల్లో సుశీల్ కాజల్ ఒకరు. అదే రోజు రాత్రి లాఠీచార్జ్‌లో తగిలిన దెబ్బలతో ఇంటికి వచ్చిన సుశీల్ తెల్లారేసరికి విగతజీవిగా మిగిలిపోయాడు. కాగా కర్నాల్ ఎస్పీ గంగారామ్ పునియా మాత్రం పోలీసులతో జరిగిన ఘర్షణలో తగిలిన గాయాలకు, అతని మరణానికి సంబంధం లేదని ప్రకటించారు. కాగా సుశీల్ స్నేహితులు, కుటుంబం, రైతు సంఘాల నాయకులు మాత్రం ఇది పోలీసుల హత్యేనని అంటున్నారు. రైతు ఉద్యమంలో చురుగ్గా: రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రైతు సుశీల్ కాజల్‌తో పాటు ఆయన తల్లి, భార్య సుదేష్ దేవి, కుమారుడు సాహిల్, కుమార్తె అన్నూ నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే రైతు ఉద్యమంలో పాల్గొన్న సమయంలో సుశీల్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం దిగ్భ్రాంతిలో ఉంది. కాగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కాని, పోలీసులు కాని తమ ఇంటికి రాలేదని, కానీ సుశీల్ మరణాన్ని గుండెపోటులా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుశీల్‌కు 1.5 ఎకరాల భూమితో పాటు ఉన్న కొద్దిపాటి పాడి వారి జీవనాధారం అని, కుటుంబం వాటిపైనే ఆధారపడి జీవిస్తోందని గ్రామస్తులు తెలిపారు. రూ.లక్ష సాయం అందించిన ఆలిండియా కిసాన్ సంఘం రాయ్‌పూర్ జట్టన్ గ్రామంలో చనిపోయిన రైతు సుశీల్ కాజల్æ కుటుంబాన్ని ఎఐకెఎస్ ప్రతినిధి బృందం మంగళవారం పరామర్శించి రూ.లక్ష సాయం అందించింది. చెక్కును సుశీల్ భార్య సుధేష్ దేవికి ఎఐకెఎస్ కోశాధికారి పి.కృష్ణప్రసాద్ తదితరులు అందించారు. వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కర్నాల్‌లోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. -
కేసీఆర్ నిజాం పరమభక్తుడిలా మారారు
సాక్షి,కరీంనగర్ : ఆర్టీసీ కార్మికుడు చనిపోతే శవరాజకీయం అంటున్న వారు ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం 1200 మంది ప్రాణత్యాగం చేస్తే మీరు చేసింది ఏమిటో చెప్పాలంటూ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. తాను ఒక ఎంపీనన్న విషయం మరిచి కాలర్ పట్టుకొని దాడి చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై ప్రివిలైజేషన్ మోషన్‌ను మూవ్ చేస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసు అధికారులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు యునిఫామ్‌లు లేకుండా మఫ్టీలు, మాస్కులు వేసుకొని వచ్చి లాఠీచార్జీ చేయడం నిజాం నిరంకుశ పాలనను గుర్తుకు తెస్తుందని విమర్శించారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని, కరీంనగర్ నుంచే ఆయన పతనం ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రగతి భవన్లో కూర్చొని జల్సాలు చేస్తున్న కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు గులాంగిరి చేస్తూ వ్యవస్థను నాశానం చేస్తున్నారని ఆరోపించారు. నిజాం పరమభక్తుడిలా తయారైన కేసీఆర్‌ను ప్రగతి భవన్‌కే పరిమితం చేస్తామని వెల్లడించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆ రుచి ఎలా ఉంటుందో ఆయనకు త్వరలోనే అర్థమయ్యేటట్లు చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్లో జరిగిన సంఘటనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దాదాగిరి, దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ సహించేది లేదని చట్టపరిధిలోనే కేంద్రం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విరిగిన లాఠీ
పిఠాపురం : ఉప్పాడకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఓసిపల్లి కృపారావు, తిక్కాడ యోహానుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నిరసన తెలిపిన ఆ పార్టీ శ్రేణులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు ఝళిపించారు. పోలీసుల దెబ్బలకు ఓసిపల్లి కోదండ, వంకా కొర్లమ్మ అనే మహిళలు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయారు. నలుగురు యువకులకు పోలీసులు దుస్తులు ఊడదీసి పోలీస్‌స్టేషన్‌లోకి ఈడ్చుకెళ్లారు. అక్కడి నుంచి వారికి మరోచోటుకు తరలించారు. పోలీసుల దౌర్జన్యకాండ తీవ్ర విమర్శలకు దారితీసిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి మండలం ఉప్పాడను దత్తత తీసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తమ గ్రామానికి ఎలాంటి మేలు చేయలేదని ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానికులు టీడీపీ నేతలను పలుచోట్ల అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 11వ తేదీన పోలింగ్ జరుగుతుండగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ హైస్కూలులోని పోలింగ్ బూత్‌లోకి కారుతో సహా ప్రవేశించి, గేటు మూసి ఎన్నికల ప్రచారం చేయడంపై ఓటర్లు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అందరినీ అక్కడి నుంచి పంపించారు. కొత్తపల్లి పోలీసు స్టేషన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయరా? వైఎస్సార్సీపీ నేతలు తన కారుపై రాళ్లతో దాడి చేశారంటూ రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే వర్మ కొత్తపల్లి పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీకి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లతోపాటు కొందరు ఓటర్లు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాలతో ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలపై మరో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అక్రమ అరెస్టులు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని విస్మరిస్తూ మంగళవారం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు ఓసిపల్లి కృపారావు, తిక్కాడ యోహానులను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతూ ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలకు వంత పాడిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో విరుచుకుపడ్డారు. అందరినీ లాగిపడేశారు. మహిళలను సైతం తోసివేశారు. కారుతో సహా పోలింగ్ బూత్‌లోకి చొరబడ్డ ఎమ్మెల్యే వర్మను వదిలేసిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా, ఎమ్మెల్యే కారుపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని కాకినాడ డీఎస్పీ రవివర్మ మీడియాకు తెలిపారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఉద్రిక్తతకు కారణమైన ఘటనలో మరో నలుగురి విచారిస్తున్నామని, వారిపై కేసులు ఇంకా నమోదు చేయలేదన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తల పై పోలీసుల లాఠీచార్జి
-
లాఠీచార్జి అన్యాయం : సీపీఎం
సూర్యాపేట : ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేలాది ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకొని ఎదురు తిరిగిన రైతులపై లాఠీచార్జి చేయడం అన్యాయం సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వకుండా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో చెప్పకుండానే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో పల్లేటి వెంకన్న, వేల్పుల వెంకన్న, సైదులు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
డీసీఎం ఢీకొని వృద్ధురాలి మృతి
మహబూబ్ నగర్: అడ్డాకుల మండలం జానం పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం ఢీకొని వృద్ధురాలి మృతి చెందింది. దీంతో హైవేపై గ్రామస్తులు నిరసన, ధర్నాకు దిగారు. ఫలితంగా రోడ్డుపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకున్నా వారు వెనుకకు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. వనపర్తి డీఎస్పీ చెన్నయ్య తలకు గాయం అయ్యింది. -
ఆస్పత్రి వద్ద లాఠీచార్జి
విజయమ్మ, భారతిలను లోనికి అనుమతించకపోవడంతో జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహించారు. ఆస్పత్రి గేటు ఎదుట ధర్నాకు దిగారు. దాంతో వారిపై పోలీసులు లాఠీచార్జికి దిగారు. ఎట్టకేలకు జైలు అధికారుల ఆదేశాల మేరకు రాత్రి 1.00 గంటల సమయంలో విజయమ్మ, భారతి వాహనాన్ని ఆస్పత్రిలోకి అనుమతించారు. వారిద్దరు జగన్‌తో అరగంట పాటు మాట్లాడి వచ్చారు.