
ప్రజాగాయకుడు దరువు అంజన్న అదృశ్యం
హైదరాబాద్: ప్రజాగాయకుడు ,ఓయూ జేఏసీ నేత దరువు అంజన్న మంగళవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అతడే కిడ్నాప్ చేయించి ఉంటాడని అంజన్న భార్య సునీత జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రసమయికి వ్యతిరేకంగా అంజన్న "ధూంధాం" నిర్వహిస్తుండటమే ఈ కిడ్నాప్‌నకు కారణమని అతని భార్య ఆరోపించింది.