
నేను దళితుడిలాగా కనిపించటంలేదా?
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గంలో మాల, మాదిగ, మహిళలకు సమున్నత స్థానం లభించలేదన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రంగా ఖండించారు. తాను దళితుడిలాగా రేవంత్ రెడ్డికి కనిపించటం లేదా అని బాలకిషన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో కులాల ప్రస్తావన తీసుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
దళితులను కించపరిచేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు తక్షణమే క్షమాపణ చెప్పాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. దళిత ద్రోహిగా వ్యవహరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ...ఆపార్టీ ఎమ్మెల్యేలు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో టీడీపీ ఎజెండా ఎప్పటికీ వర్కవుట్ కాదని బాలకిషన్ అన్నారు.