
కరీంనగర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మానకొండూర్‌లో బుధవారం శంకరపట్నం మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా మూడోసారి గెలిపిస్తామని సర్పంచులు, ఎంపీటీసీలు మద్దతు పలికారు. గులాబీ పార్టీకి ఎదురులేదని, కార్యకర్తలు అండగా ఉన్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీని వాస్‌రెడ్డి, సర్పంచులు సంజీవరెడ్డి, విజయకుమార్, రంజిత్‌రావు, çసంపత్, భద్రయ్య, రవి, రాజయ్య, కిషన్‌రావు, వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, మొయిన్, సంపత్, తిరుపతయ్య, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక..
మండలంలోని పలువురు యువకులు బుధవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు, మహిపాల్, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment