టీఎస్ లాసెట్-2015 ఫలితాలు విడుదల | ts law results released | Sakshi
Sakshi News home page

టీఎస్ లాసెట్-2015 ఫలితాలు విడుదల

Published Sat, Jun 6 2015 3:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

ts law results released

మూడేళ్ల లా కోర్సులో 85.20% ఉత్తీర్ణత
ఐదేళ్ల లా కోర్సులో 82.87 %
ఎల్‌ఎల్‌ఎం పీజీ సెట్‌లో 95.95%

 కేయూక్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలోని ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు, ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు గత నెల 19న నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ సెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు.  కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు ఫలితాల సీడీలను విడుదల చేశారు. కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్ మూడేళ్ల కోర్సులో 13,507 మంది అభ్యర్థులకు గాను 11,680 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 9,951మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (85.20 శాతం) సాధించారు. పురుషుల విభాగంలో 9,324 మంది పరీక్షకు హాజరుకాగా,  8,165 మంది ఉత్తీర్ణత (87.57శాతం) పొందారు. మహిళల విభాగంలో 2,356 మంది పరీక్షకు హాజరు కాగా, 1,786 మంది (75.81శాతం) ఉత్తీర్ణులయ్యూరు. 

 ఐదేళ్ల లా కోర్సులో...: ఐదేళ్ల లాకోర్సులో 4,257మంది అభ్యర్థులకు 3,695 మంది పరీక్షకు హాజరుకాగా... ఇందులో 3,062 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (82.87 శాతం) సాధించారు. పురుషుల విభాగంలో 85.65శాతం, మహిళల విభాగంలో 73.88 శాతం ఉత్తీర్ణత పొందారు.  
 పీజీ లా సెట్‌లో...: ఎల్‌ఎల్‌ఎం పీజీ సెట్‌లో రాష్ట్రవ్యాప్తంగా రెండు రీజియన్ల సెంటర్ల పరిధిలో (హైదరాబాద్, వరంగల్ ) 1,584 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 1,328 మంది ఉత్తీర్ణత (95.95 శాతం)  సాధించారు. పురుషుల విభాగంలో  96.01 శాతం, మహిళల విభాగంలో 95.80 శాతం  ఉత్తీర్ణులయ్యూరు. పీజీ లాసెట్‌లో హైదరాబాద్‌కు చెందిన జీవీ.సుబ్రమణ్యన్ 79 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. ఆయన 60 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం విశేషం.
 అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
 మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సు, ఎల్‌ఎల్‌ఎం పీజీసెట్‌కు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను జూలై 20న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 26 నుంచి 29 వరకు ఉంటుందన్నారు.
 
 లాసెట్ ఫలితాల్లో మూడేళ్లు, ఐదేళ్ల,  ఎల్‌ఎల్‌ఎం పీజీ సెట్‌లో ర్యాంకులు సాధించినవారు
 లాసెట్ మూడేళ్ల కోర్సులో...
 పేరు                                             ర్యాంక్      మార్కులు
 వీజీ.సతీష్ పసుమర్తి, రంగారెడ్డి          1            102
 చంద్రశేఖర్ ఆర్, కరీంనగర్                 2            101
 దేవేందర్‌రెడ్డి తిరుగుడు, నల్లగొండ        3           98    
 లాసెట్ ఐదేళ్ల కోర్సులో ర్యాంకర్లు....
 సుదగాని రాజు, నల్లగొండ                   1         101
 లకమ్ నర్సింహ రావు, నల్లగొండ         2          99
 రాంబాబు మోటె, నల్గొండ                    3         97
 ఎల్‌ఎల్‌ఎం పీజీసెట్‌లో ర్యాంకర్లు...
 రజత్ బెనర్జీ, రంగారెడ్డి                        1            83
 జి.వి సుబ్రమణ్యం, హైదరాబాద్             2          79
 మిధున్ కుమార్ ఎ, రంగారెడ్డి             3           76
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement